నీ అంతు చూస్తా....నిన్ను వదలను

by velandi.Saikiran |   (  Updated:2025-11-07 14:41:00  IST  )

విజయవాడ డీలర్ ను నిజామాబాద్ కు చెందిన ఓ హార్వెస్టర్ యజమాని నిలదీశారు.

నీ అంతు చూస్తా....నిన్ను వదలను
X

దిశ, వైరా : నీ అంతు చూస్తా.... తప్పుడు మాటలు చెప్పి హార్వెస్టర్ ను విక్రయించావ్.... ఆపై నాకు ఫోన్ చేసి బెదిరిస్తున్నావా ? అంటూ విజయవాడ డీలర్ ను నిజామాబాద్ కు చెందిన ఓ హార్వెస్టర్ యజమాని నిలదీశారు. శుక్రవారం దిశ వెబ్సైట్ లో "నోబిల్.... అంతా మోసమే", "మాకు బిల్లు ఇవ్వలేదంటే.... మాకు బిల్లు ఇవ్వలేదు" అంటూ పలువురు చైన్ హార్వెస్టర్ కస్టమర్లు వ్యక్తం చేసిన ఆవేదనను కథన రూపంలో ప్రచురణ అయింది.

ఈ వార్తలతో బెంబేలెత్తిన విజయవాడకు చెందిన ఓ డీలర్ నందిపేట్ కు చెందిన రవి అనే హార్వెస్టర్ యజమానికి ఫోన్ చేసి బెదిరించారు. ఆ సమయంలో సదరు రవి రివ‌ర్స్ ఎటాక్ చేశాడు. మీ కంపెనీ మమ్మల్ని మోసం చేసింది మేము ఎంత దాకా అయినా వెళ్తాం.... మీరు బెదిరిస్తే మేము భయపడబోమంటూ అల్టిమేటం జారీ చేశారు. స్పేర్ పార్ట్స్ కోసం సదరు డీలర్ డబ్బులు కొట్టించుకోని బిల్లులు ఇవ్వలేదు. అందుకు సంబంధించిన ఫోన్ పే బిల్లులను రవి దిశకు పంపించారు. ఇప్పటికే ఆ కంపెనీకి సంబంధించిన బాధితులు అందరూ ఏకమైనట్లు సమాచారం.

Next Story