తెలంగాణలో గులాబీ పార్టీదే మళ్లీ అధికారం

by velandi.Saikiran |

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత కేసీఆర్ పదేళ్ల పాలనలోనే మధిర పట్టణం అభివృద్ధి చెందిందని ఖమ్మం మాజీ ఎంపీ, బీ.ఆర్.యస్ మాజీ లోక్ సభాపక్ష నేత నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు.

తెలంగాణలో గులాబీ పార్టీదే మళ్లీ అధికారం
X

దిశ మధిర : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత కేసీఆర్ పదేళ్ల పాలనలోనే మధిర పట్టణం అభివృద్ధి చెందిందని ఖమ్మం మాజీ ఎంపీ, బీ.ఆర్.యస్ మాజీ లోక్ సభాపక్ష నేత నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం మధిర పట్టణం లోని 19,20,21 వార్డుల్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం లో మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, సీపీఎం మధిర డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాల్ రావు తో కలసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల ముందు గ్యారెంటీ కార్డులు ఇచ్చి దాచిపెట్టుకోండి అన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కార్డులో చెప్పినట్లు మహిళలకు ఇచ్చిన హామీలు ఇస్తామని చెప్పి మాట తప్పిన భట్టిని, కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని పిలుప్పునిచ్చారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలతో కాంగ్రెస్ నాయకులు ప్రజలను మోసం చేశారన్నారు. మధిర పట్టణం లో 100పడకల ఆసుపత్రి, ట్యాంక్ బండ్, వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ సహా మధిరలో ప్రతి అభివృద్ధి కేసీఆర్ హయాం లో చేసినవే చేసినవే అన్నారు.

Next Story