కేంద్రమంత్రి నితిన్ గడ్కరిని కలిసిన ఎంపీ అరవింద్

by Ratna Kumari |

దిశ, జగిత్యాల టౌన్ : జగిత్యాల నియోజకవర్గం లో రోడ్డు విస్తరణ పనుల విషయం పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కేంద్ర

కేంద్రమంత్రి నితిన్ గడ్కరిని కలిసిన ఎంపీ అరవింద్
X

దిశ, జగిత్యాల టౌన్ : జగిత్యాల నియోజకవర్గం లో రోడ్డు విస్తరణ పనుల విషయం పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కేంద్ర రవాణా శాఖ మంత్రి మంత్రి నితిన్ గడ్కరిని కలిసి వినతి పత్రం అందజేశారు. గతంలో నియోజకవర్గంలోని రోడ్డు విస్తరణ పనులు రైల్వే అండర్ పాస్ బ్రిడ్జిల నిర్మాణం మరమ్మతుల కొరకు రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి ఎంపీ అరవింద్ విన్నవించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీ పలు గ్రామాల్లో రోడ్డు విస్తరణ రైల్వే అండర్ పాస్ పనుల గురించి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి త్వరగా పనులు చేపడుతామని హామీ ఇచ్చినట్లు ఎంపీ కార్యాలయ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. ఈ సందర్భంగా జగిత్యాల నియోజకవర్గం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్ట‌ర్ బోగ శ్రావణి, నిజామాబాద్ ఎంపీ అరవింద్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Next Story