- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మోరంపల్లిబంజర్‌లో కోతుల బెడదకు చెక్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని మోరంపల్లిబంజర్ గ్రామస్తులకు ఎట్టకేలకు కోతుల బెడద నుంచి విముక్తి లభించనుంది.

దిశ, బూర్గంపాడు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని మోరంపల్లిబంజర్ గ్రామస్తులకు ఎట్టకేలకు కోతుల బెడద నుంచి విముక్తి లభించనుంది. గత కొంతకాలంగా గ్రామంలో కోతులు విపరీతంగా పెరిగి ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇళ్లలోకి చొరబడటం, పంటలను నాశనం చేయడం, చిన్నపిల్లల పై దాడులు చేయడంతో గ్రామస్తులు బెంబేలెత్తిపోయారు.
పాలకవర్గం చొరవ.. ప్రత్యేక బృందం రాక
గ్రామస్తుల కష్టాలను గుర్తించిన మొరంపల్లిబంజర్ గ్రామ పంచాయతీ పాలకవర్గం సంచలన నిర్ణయం తీసుకుంది. సర్పంచ్ సుభద్ర, ఉపసర్పంచ్ పోక్కుల రవి ప్రత్యేక చొరవ చూపి, కోతులను పట్టేందుకు హైదరాబాద్ నుండి ఒక అనుభవజ్ఞులైన నిపుణుల బృందాన్ని రప్పించారు.
ముమ్మరంగా కోతుల వేట...!
హైదరాబాద్ బృందం గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో బోన్లను ఏర్పాటు చేసి కోతులను బంధిస్తుంది. ఇప్పటికే భారీ సంఖ్యలో కోతులు బోన్లలో చిక్కాయి. వీటిని సురక్షితంగా దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలేయనున్నట్లు పంచాయతీ కార్యదర్శి భవాని తెలిపారు. కోతుల వల్ల గ్రామంలో ప్రశాంతత కరువైంది. ప్రజల భద్రత దృష్ట్యా సొంత ఖర్చులతోనైనా ఈ సమస్యకు పరిష్కారం చూపాలని హైదరాబాద్ నుంచి నిపుణులను పిలిపించామని సర్పంచ్ బోర్రా సుభద్ర "దిశ"కు తెలిపారు. పంచాయతీ పాలకవర్గం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోతుల భయం పోవడంతో మోరంపల్లిబంజర్ వాసులు ఊపిరి పీల్చుకుంటున్నారు.






