ప్రధానిగా 12 ఏళ్లు.. ఇవాళ‌ NDA నేతలతో మోడీ అత్య‌వ‌స‌ర స‌మావేశం

by velandi.Saikiran |

ప్రధానిగా బాధ్య‌త‌లు తీసుకుని 12 ఏళ్లు అయిన త‌రుణంలో NDA నేతలతో మోడీ అత్య‌వ‌స‌ర స‌మావేశం కానున్నారు.

ప్రధానిగా 12 ఏళ్లు.. ఇవాళ‌ NDA నేతలతో మోడీ అత్య‌వ‌స‌ర స‌మావేశం
X

దిశ‌, వెబ్ డెస్క్: దేశ ప్రధానిగా ప్రధాని నరేంద్ర మోడీ సరికొత్త చరిత్ర సృష్టించారు. వరుసగా 12 సంవత్సరాల పాటు దేశ ప్రధానిగా సేవలు అందించిన‌ నాయ‌కుడిగా నరేంద్ర మోడీ హిస్ట‌రీ క్రియేట్ చేశారు. ఇప్పటి వరకు 4399 రోజుల పాటు ప్రధానిగా కొనసాగారు. అయితే ప్రధానిగా మోడీ 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇవాళ ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది.

మోడీ అధ్యక్షతన భారత్ మండపంలో జరిగే ఈ సమావేశానికి 22 ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు, UT రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీనియర్ నాయకులు హాజరవుతారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా పథకాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, వికసిత్ భారత్ రోడ్ మ్యాప్, పశ్చిమాసియా సంక్షోభంపై చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Next Story