మళ్లీ యుద్ధం.. ఇరాన్‌పై అమెరికా దాడులు

by velandi.Saikiran |

అమెరికా వర్సెస్ ఇరాన్ మధ్య మళ్ళీ యుద్ధం మొదలైంది.

మళ్లీ యుద్ధం.. ఇరాన్‌పై అమెరికా దాడులు
X

దిశ‌, వెబ్ డెస్క్: అమెరికా వర్సెస్ ఇరాన్ మధ్య మళ్ళీ యుద్ధం మొదలైంది. ఒకరిపై మరొకరు దాడులకు దిగుతున్నారని తెలుస్తోంది. తమ సైన్యానికి చెందిన అపాచీ హెలికాప్టర్ ను ఇరాన్ కూల్చేసిందని అమెరికా ఆరోప‌ణ‌లు చేస్తోంది. ఒమన్ తీరం వెంబడి హార్ముజ్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున గస్తీ చేస్తుండగా.. మిలిటరీ హెలికాప్టర్ ఏహెచ్ 64 అపాచీ కూలిపోయింది. అందులో ఉన్న తమ ఇద్దరు పైలట్లను ఓ డ్రోన్ బోట్ సహాయంతో అమెరికా రక్షించింది. ఇరాన్ డ్రోన్ దాడి కారణంగా హెలికాప్టర్ కూలినట్లు అమెరికా దర్యాప్తులోనూ తేలిందట‌.

ఈ క్రమంలోనే ప్రతికార దాడులకు దిగుతోంది అమెరికా. అన్యాయమైన దురాక్రమనకు ప్రతిస్పందనగా ఆపరేషన్ చేపట్టినట్లు యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ అధికారికంగా ప్రకటన చేసింది. ఈ మేరకు తమ సైన్యాన్ని సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక అంతకుముందు దాడికి తప్పనిసరిగా సమాధానం ఇస్తామని ట్రూత్ సోషల్ లో ట్రంప్ పోస్ట్ కూడా పెట్టారు. అయితే అమెరికా దాడులు చేస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఇరాన్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Next Story