రుతురాజ్ స‌రికొత్త రికార్డ్...కోహ్లీ వ‌ల్ల కూడా కాలేదు !

by velandi.Saikiran |

లిస్టు A క్రికెట్ లో విరాట్ కోహ్లీ కంటే ఎక్కువ యావరేజ్ సంపాదించి, సత్తా చాటాడు రుతురాజ్.

రుతురాజ్ స‌రికొత్త రికార్డ్...కోహ్లీ వ‌ల్ల కూడా కాలేదు !
X

దిశ‌, వెబ్ డెస్క్: భారత జట్టులో అప్పుడప్పుడు మాత్రమే అవకాశం దక్కించుకుంటున్న రుతురాజ్ గైక్వాడ్ సరికొత్త రికార్డు సృష్టించాడు. విరాట్ కోహ్లీకి సాధ్యం కానీ, హిస్టరీ క్రియేట్ చేశాడు. లిస్టు A క్రికెట్ లో విరాట్ కోహ్లీ కంటే ఎక్కువ యావరేజ్ సంపాదించి, సత్తా చాటాడు రుతురాజ్. 63 ఏళ్ల లిస్ట్ A క్రికెట్ లో రుతురాజ్ 59.32 యావరేజ్ సంపాదించాడు. ఈ నేపథ్యంలో 5161 పరుగులు సాధించాడు. అటు విరాట్ కోహ్లీ 16,447 పరుగులు సాధించినప్పటికీ... యావరేజ్ 57.91 మాత్రమే ఉంది.

ఈ ఇద్దరి తర్వాత ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు బెవన్ 57.86 యావరేజ్ సాధించాడు. దీంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది. కాగా ప్రస్తుతం భారత్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక ఏ జ‌ట్ల‌ మధ్య ట్రై సిరీస్ జరుగుతోంది. ఇందులో భాగంగానే తాజాగా శ్రీలంక ఏ, భారత్ ఏ జట్ల మధ్య తొలి వన్డే జరిగింది. ఇందులో రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ చేయగా 8 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది.

Next Story