- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. వారి అకౌంట్లలోకి రూ.13 వేలు ?
తల్లికి వందనం పథకాన్ని జూలైలో అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం అందుతోంది.

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తల్లికి వందనం పథకాన్ని జూలైలో అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం అందుతోంది. గత సంవత్సరం జూన్ 12వ తేదీన విద్యార్థుల తల్లుల అకౌంట్లో రూ. 13 వేల చొప్పున డబ్బులు జమ చేసింది సర్కార్. అయితే ఈ ఏడాది పలు కారణాలతో, కాస్త ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు కుటుంబంలో అర్హులైన విద్యార్థులందరికీ ఈ పథకం అమలు చేస్తున్నారు.
ఈ సారి దాదాపు 68 లక్షల మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. కాగా వైసీపీ హయాంలో ఎంత మంది పిల్లలు ఉన్నప్పటికీ కుటుంబంలో ఒక్కరికి మాత్రమే అమ్మ ఒడి అమలు చేశారు. ఇద్దరు, ముగ్గురు బడికి వెళ్లే పిల్లలు ఉన్నప్పటికీ రూ.13000 మాత్రమే ఇచ్చింది. అయితే కూటమి సర్కార్ వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా రూ.13000 చొప్పున అందిస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఏపీలో ఎల్లుండి నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. తెలంగాణలో మాత్రం వచ్చే సోమవారం స్కూల్స్ రీ-ఓపెన్‌కానున్నాయి.






