ఒకే వేదికపై తాజా, మాజీ ఎమ్మెల్యేలు

by velandi.Saikiran |

ఇప్పటివరకు ఉప్పు, నిప్పు గా ఉన్న ఎమ్మెల్యే వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే వీరయ్యలు ఒకే వేదికపై పాల్గొన్నారు. భద్రాచలం

ఒకే వేదికపై తాజా, మాజీ ఎమ్మెల్యేలు
X

దిశ, భద్రాచలం : ఇప్పటివరకు ఉప్పు, నిప్పు గా ఉన్న ఎమ్మెల్యే వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే వీరయ్యలు ఒకే వేదికపై పాల్గొన్నారు. భద్రాచలం నియోజవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం పట్టణంలోని రెడ్డి సత్రంలో జరిగింది. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు, ఫారెస్ట్ డెవోలోప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పొదేం వీరయ్య, ఎమ్మెల్యే తెల్లం పాల్గొన్నారు. వచ్చే స్థానిక ఎన్నికలలో కలిసికట్టుగా పని చేసి, అన్ని స్థానాలను గెలుచుకునేందుకు ఇద్దరు ఒకే వేదికను పంచుకున్నారు.వర్గాలుగా కాకుండా, అందరం కలిసి ఐకమత్యంగా పని చేద్దామ‌ని కార్యకర్తలకు సంకేతం పంపారు.

ఈ కార్యక్రమంలో పొదేం వీరయ్య మాట్లాడుతూ, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇదే కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంకట్రావు మాట్లాడుతూ, ప్రతి మండలంలో జెడ్పిటీసికి ముగ్గురు పేర్లు నమోదు చేసుకుని అధిష్టానానికి పంపనున్నట్లు తెలిపారు. పార్టీ అభివృద్ధి కోసం కష్టపడిన కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్సులు నల్లపు దుర్గా ప్రసాద్, నాగ సీతారాములు, మోటుకూరి ధర్మా రావు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న, జిల్లా గ్రంధాలయం అధ్యక్షులు వీరబాబు, ఎస్ సి సెల్ జిల్లా అధ్యక్షులు రవి కుమార్, పీసీసీ సభ్యులు బుడగం శ్రీనివాస్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు పరిమి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Next Story