- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజ్యాంగ పరిరక్షణతోనే ప్రజాస్వామ్యానికి భద్రత: ఎమ్మెల్యే కూనంనేని
రాజ్యాంగ పరిరక్షణతోనే ప్రజాస్వామ్యానికి భద్రత..

దిశ, కొత్తగూడెం ప్రతినిధి: రాజ్యాంగ పరిరక్షణతోనే ప్రజాస్వామ్యానికి భద్రత.. రాజ్యంగా పరిరక్షణతోనే ప్రజాస్వామ్యానికి భద్రత ఉంటుందని, ప్రస్తుత పరిస్థితిలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునే బాధ్యత ప్రతీ భారతీయ పౌరుడిపై ఉందని కొత్తగూడెం శాసనససభ్యులు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. 77వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా సిపిఐ, ప్రజాసంఘాలు, పంచాయతీ పాలకవర్గ, ఉద్యోగ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కొత్తగూడెం నియోజకవర్గవ్యాప్తంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలు గ్రామ పంచాయతీ కార్యాలయాలు, కార్మికుల అడ్డాలు, బస్తీ సెంటర్లు, పార్టీ కార్యాలయాల్లో పర్యటించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచే..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డాక్టర్ బీఆర్. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం వల్లే దేశంలోని అణగారిన వర్గాలకు హక్కులు లభిస్తున్నాయని, ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని పేర్కొన్నారు. కార్మికుల హక్కుల కోసం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం రాజీలేని పోరాటం చేస్తామని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు. దేశ సమగ్రతకు, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచే గణతంత్ర స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ చాటాలని పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లోని సామాన్య ప్రజల నుంచి పట్టణాల్లోని కార్మికుల వరకు అందరి సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమాల్లో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, జిల్లా కార్యవర్గ సభ్యులు కంచర్ల జమలయ్య, కందుల భాస్కర్, సలిగంటి శ్రీనివాస్, నాయకులు వంగ వెంకట్, నేరెళ్ల రమేష్, గెడ్డాడు నగేష్, యూసుఫ్, తదితరులు పాల్గొన్నారు.






