- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నల్లమలలో మిస్సింగ్... రెస్క్యూ చేసి ఇద్దరిని కాపాడిన పోలీసులు
నల్లమల్ల అటవీ ప్రాంతం లింగాల మండల పరిధి బాణాలొద్దీ కాలువలో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులను ఎస్సై వెంకటేష్ గౌడ్ తన

దిశ, అచ్చంపేట : నల్లమల్ల అటవీ ప్రాంతం లింగాల మండల పరిధి బాణాలొద్దీ కాలువలో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులను ఎస్సై వెంకటేష్ గౌడ్ తన సిబ్బందితో గురువారం అర్ధరాత్రి రెస్క్యూ చేసి రక్షించారు. ఈ ఘటనకు సంబంధించి ఎస్సై దిశతో ఫోన్ ద్వారా తెలిపిన వివరాల ప్రకారం...పెద్దకొత్తపల్లి గ్రామానికి చెందిన జంపయ్య, వెంకటస్వామి అనే ఇద్దరు వ్యక్తులు గొర్రెలకు పసరు మందుల కొరకు ఉదయం ఎనిమిది గంటలకు వెళ్లి.... నల్లమల దట్టమైన అడవిలో దారి తప్పిపోయారు.
అప్పయి పల్లి గ్రామానికి చెందిన మొగిలి నిరంజన్ కు అడివిలో దారి తప్పిన వ్యక్తులు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దింతో స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు మొగిలి నిరంజన్. ఆ తర్వాత లొకేషన్ ఆధారంగా అర్ధరాత్రి రెస్క్యూ చేసి బాధితులను రక్షించారు. ఇందులో పోలీసులతోపాటు స్థానికులైన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొగిలి నిరంజన్, మూడవత్ కృష్ణ, రమావత్ చందర్, వర్త్య, సంతోష్, మాదగౌని రాజు, కేతావత్ గిల్లో రవి, అలాగే బాణాలకు చెందిన నలుగురు యువకులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ విషయంలో చాకచకంగా వ్యవహరించిన ఎస్సై వెంకటేష్ గౌడ్, పోలీస్ సిబ్బందికి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు.






