- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏడాది క్రితం తప్పిపోయి.. నేడు కుటుంబ సభ్యుల చెంతకు
మతి స్థిమితం కోల్పోయి ఏడాది క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన ఓ వ్యక్తి నేడు కుటుంబ సభ్యుల చెంతకు చేరాడు. ఈ ఘటన వైరా మున్సిపల్ పరిధిలోని సోమవారం గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.

ఏడాది క్రితం తప్పిపోయి.. నేడు కుటుంబ సభ్యుల చెంతకు
- పోలీసులు, అన్నం ఫౌండేషన్ కు కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యుల
దిశ, వైరా: మతి స్థిమితం కోల్పోయి ఏడాది క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన ఓ వ్యక్తి నేడు కుటుంబ సభ్యుల చెంతకు చేరాడు. ఈ ఘటన వైరా మున్సిపల్ పరిధిలోని సోమవారం గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బాదం హరికృష్ణా రెడ్డి మానసిక పరిస్థితి సరిగా లేక ఏడాది క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. గడ్డం పెంచుకొని చింపిరి బట్టలతో రోడ్ల వెంట తిరుగుతూ ఉండేవాడు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో కొన్ని రోజుల తర్వాత కృష్ణారెడ్డి ఆచూకీ గురించి వెతకడం మానేశారు. ఈ క్రమంలో ఖమ్మం నగరానికి చెందిన అన్నం ఫౌండేషన్ నిర్వాహకులు అన్నం శ్రీనివాసరావు ఓ పని మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో బస్టాండ్ సమీపంలో గడ్డం పెంచుకుని సంచరిస్తున్న వ్యక్తిని చూసి అతడి వివరాలు ఆరా తీసి వైరా పోలీసులకు సమాచారం అందించారు. హరికృష్ణారెడ్డి వివరాలను సేకరించి వైరా పోలీస్ స్టేషన్ కు తీసుకు వచ్చారు. అనంతరం వైరా సీఐ సాగర్, ఎస్సై రామారావు సమక్షంలో అన్నం శ్రీనివాసరావు హరికృష్ణ రెడ్డిని వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. చాలా రోజులు కనిపించకుండా పోయిన వ్యక్తి కళ్ల ముందు ప్రత్యక్షం కావడంతో వారి సంతోషానికి అడ్డే లేకుండా పోయింది. కుటుంబ సభ్యులు పోలీసులకు, అన్నం ఫౌండేషన్ నిర్వాహకులు శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలిపారు.






