- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు పిలుపునిస్తాం
సింగరేణిలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకుంటే సమ్మెకు పిలుపునిస్తామని అదనపు మిరియాల రంగయ్య

దిశ, సత్తుపల్లి: సింగరేణిలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకుంటే సమ్మెకు పిలుపునిస్తామని అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య యాజమాన్యాని హెచ్చరించారు. సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, సత్తుపల్లి కేంద్రంగా నడుస్తున్న సింగరేణిలో కార్మికులు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారని వెల్లడించారు.
వాటిని తక్షణమే పరిష్కారం చేయాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్ లో చాలాకాలంగా ఉన్న డిపెండెంట్ లకు ఉద్యోగ నియామకాల పత్రాలు వెంటనే జారీ చేయాలని కోరారు. మెడికల్ బోర్డు పెట్టకుండా యాజమాన్యం కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. రీజియన్ లో ఉన్న వికే కోల్ మైన్ లో సింగరేణి కార్మికుల ద్వారానే బొగ్గును వెలికి తియ్యాలని తెలిపారు.
సింగరేణి కార్మికులు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న సొంతింటి కల నెరవేర్చి ప్రతి కార్మికుడికి 200వందల గజాల స్థలం తో పాటు రూ.30లక్షలు వడ్డీలేని రుణం ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిస్మిస్ అయిన ఉద్యోగులకు మళ్లీ ఒక అవకాశంగా ఉద్యోగాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమం లో కార్పొరేట్ బ్రాంచ్ కార్యదర్శి రమణమూర్తి,సెంట్రల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి వీరస్వామి, సత్తుపల్లి కార్యదర్శి సుధాకర్ సముద్రాల, సీనియర్ నాయకులు దండు ఆదినారాయణ,బీమయ్య,సూర్యప్రకాష్,నర్సింహారావు,భరణి, చారి, నరేందర్, బి సుధాకర్,బాలసుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.






