స్వర్గీయ చీకటి ధర్మయ్యకు మంత్రి తుమ్మల నివాళులు

by velandi.Saikiran |

సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని గుడిపాడురోడ్డుకు చెందిన చీకటి ధర్మయ్య సంవత్సరికం సందర్భంగా వారి కుటుంబాన్ని

స్వర్గీయ చీకటి ధర్మయ్యకు మంత్రి తుమ్మల నివాళులు
X

దిశ,సత్తుపల్లి: సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని గుడిపాడురోడ్డుకు చెందిన చీకటి ధర్మయ్య సంవత్సరికం సందర్భంగా వారి కుటుంబాన్ని మంగళవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా చీకటి ధర్మయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల వెంట సీనియర్ నాయకులు చల్లగుళ్ళ నరసింహారావు, పైడి వెంకటేశ్వరరావు, కొల్లి వెంకటేశ్వరరావు, చీకటి రామారావు, సత్తుపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తుమ్మల అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Next Story