- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇందిరమ్మ ఇండ్ల మంజూరుపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ,గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి

దిశ, కూసుమంచి: అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ,గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. శుక్రవారం మండలంలో పర్యటించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.... పేదల సంక్షేమం ధ్యేయంగా ప్రభుత్వ పాలన సాగుతోందని అన్నారు. హత్యతండా గ్రామానికి లింక్ కెనాల్ తో కలుపుకొని సుమారు 249 కోట్లు మంజూరు చేసామని వెల్లడించారు.
మల్లాయిగూడెం నుంచి భగత్ వీడు వరకు 3 కోట్ల 30 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసుకున్నామని పేర్కొన్నారు. లింగారంతండాలో 20 లక్షల రూపాయలతో చేపట్టిన గ్రామ పంచాయతీ భవనం నేడు ప్రారంభించామని అన్నారు. ఆర్ అండ్ బీ రోడ్డు నుంచి లింగారం తండా వరకు కోటి 28 లక్షలతో రోడ్డు మంజూరు చేసామని, ఈ పనులు వర్షాకాలం ముగిసే నాటికి టెండర్ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు.జీళ్ళ చెరువు గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కోసం డబుల్ లైన్ రోడ్డు, సైడ్ డ్రైయిన్లతో అద్భుతంగా తీర్చిదిద్దే దిశగా డిజైన్ చేశామని, ఈ రోడ్డు త్వరగా పూర్తి చేసి ఆలయానికి వచ్చే భక్తులకు ఉపయోగంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.
ప్రతి అసెంబ్లీ నియోజక వర్గంలో 3500 పేదలకు ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయని, 4 విడతల్లో లబ్దిదారులకు ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తు న్నామని పేర్కొన్నారు. ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇండ్ల డబ్బులు విడుదల చేస్తున్నామని తెలిపారు. రాబోయే రోజులలో అర్హులైన పేదలందరికీ తప్పనిసరిగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఎస్ఈ యాకోబు, డిప్యూటీ సిఈఓ నాగపద్మజ, ఖమ్మం ఆర్డీఓ నరసింహారావు, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, కూసుమంచి మండల తహసీల్దార్ రవికుమార్, అధికారులు తదితరులు పార్టి నాయకులు పాల్గోన్నారు.






