జాతీయ అవార్డు గ్రహీత పల్లవికి మంత్రి పొంగులేటి అభినందన

by velandi.Saikiran |

ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల గ్రామానికి చెందిన పల్లవి జాతీయ స్థాయిలో ప్రతిభ చాటడం గర్వకారణమని తెలంగాణ

జాతీయ అవార్డు గ్రహీత పల్లవికి మంత్రి పొంగులేటి అభినందన
X

దిశ, ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల గ్రామానికి చెందిన పల్లవి జాతీయ స్థాయిలో ప్రతిభ చాటడం గర్వకారణమని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్‌ విభాగంలో ఆల్‌ ఇండియా ట్రేడ్ టాపర్ గా తాళ్లూరి పల్లవి నిలిచారు.ఈ త‌రుణంలోనే.. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కౌశల్ దీక్షాంత్ సమారోహ్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా శనివారం జాతీయ అవార్డును స్వీకరించారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి పొంగులేటి ఓ ప్రకటన విడుదల చేశారు. పల్లవితో పాటు ఆమె తల్లిదండ్రులు తాళ్లూరి రవి, అజితలను కూడా అభినందిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

Next Story