- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నేను మచ్చలేని మంత్రిని: మంత్రి Puvvada Ajay Kumar
దిశ, రఘునాథపాలెం: నేను మచ్చలేని మంత్రిని... నా నియోజకవర్గంలో ఉన్న ప్రజాప్రతి నిధులు కూడా మచ్చ లేకుండా అభివృద్ధిలో పోటీ పడుతున్నారు.. ఇలాంటి క్రమంలో కొంతమంది గ్లోబల్ గాళ్లు సోషల్ మీడియా లో ఇష్టానుసారంగా బురద చళ్లుతున్నారు. అలాంటివారికి అదిరిపోయే కౌంటర్ ఇవ్వాలని రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శుక్రవారం రఘునాథపాలెం మండలంలో మంజూరైన 56 కల్యాణలక్ష్మీ/షాదీ ముబారక్ చెక్కులు, 110 ముఖ్యమంత్రి సహాయం చెక్కులను లబ్ధిదారులకు స్వయంగా పంపిణీ చేశారు.
మంత్రి పువ్వాడకు అభినందనల వెల్లువ..
తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఅర్ క్యాబినెట్ లో రవాణా శాఖ మంత్రిగా మూడేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా మండల నాయకులు ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేశారు. అనంతరం మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మంత్రి పువ్వాడకు జ్ఞాపికలు, పుష్పగుచ్చాలు, శాలువాతో సత్కరించారు.
కాళోజీకి నివాళులు..
స్వరాష్ట్ర ఉద్యమానికి తన రచనలతో స్ఫూర్తిని నింపిన తెలంగాణ సాంస్కృతిక సౌరభం, ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
కలెక్టరేట్ పనులు పరిశీలన...
వివి పాలెం వద్ద నూతంగా నిర్మిస్తున్న కలెక్టరేట్ పనులను మంత్రి పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట కలెక్టర్ గౌతమ్. ఎంపీపీ గౌరీ, జెడ్పీటీసీ ప్రియాంక, వైస్ ఎంపీపీ గుత్తా రవి కుమార్, నాయకులు మద్దినేని వెంకటరమణ, మందడపు నరసింహారావు, సుధాకర్, కుర్ర భాస్కర్, పిన్ని కోటేశ్వరరావు, అజ్మీరా వీరునాయక్, లక్ష్మణ్ నాయక్, సర్పంచ్ లు మాధంశెట్టి హరిప్రసాద్, మెంటం రామారావు, గుడిపూడి శారదా, రావేళ్ళ మాదవి, దార శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.