బ్రేక్స్ ఫెయిల్ అయి లోయలోపడ్డ మిని వ్యాన్..

by Kodari Anjali |

చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్‌ వద్ద బ్రేక్స్ ఫెయిల్ అయి, మిని వ్యాన్ లోయలో పడి, 17 మందికి తీవ్రగాయాలు అయ్యాయి.

బ్రేక్స్ ఫెయిల్ అయి లోయలోపడ్డ మిని వ్యాన్..
X

దిశ, భద్రాచలం: పోలవరం జిల్లా, చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం వేమగిరి, మేడపాడు నుండి మారేడుమిల్లి విహార యాత్రకు వచ్చిన టూరిస్టులు మారేడుమిల్లి జలతరంగిని నుండి మోతుగూడెం పొల్లూరు జలపాతం సందర్శనకు బయలుదేరారు. బ్రేక్స్ ఫెయిల్ అవ్వడంతో టూరిస్టులు ప్రయాణిస్తున్న మినీ వ్యాన్ లోయలోకి దూసుకుని వెళ్లి పల్టీ కొట్టింది. మినీ వ్యాన్ లో సుమారుగా 22 మంది ప్రయాణిస్తుండగా, ఈ ఘటనలో 17 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. ఒక బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది .పోలీసులు, సి ఆర్ పి ఎఫ్ సిబ్బంది వెంటనే స్పందించి హుటాహుటిన క్షతగాత్రులను చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. చింతురు ఏ ఎస్ పి హేమంత్ ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

Next Story