- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
13న మెగా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి
సెప్టెంబర్ 13న నిర్వహించనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని మధిర సీనియర్ సివిల్ న్యాయమూర్తి

దిశ, మధిర: సెప్టెంబర్ 13న నిర్వహించనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని మధిర సీనియర్ సివిల్ న్యాయమూర్తి ఎన్ ప్రశాంతి కోరారు. శనివారం కోర్టు హాలులో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి వేముల దీప్తి తో కలిసి నిర్వహించిన సన్నాహక సమావేశానికి పోలీసు, ఎక్సైజ్ అధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ సెప్టెంబర్ 13 వ తేదీన జరుగనున్న మెగా లోక్ అదాలత్ విజయవంతంగా నిర్వహించేందుకు అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
చిన్న పాటి నేరాలు, చోరీ, క్షణిక ఆవేశంతో జరిగిన కేసుల విషయంలో పోలీస్ సిబ్బంది ప్రత్యేక దృష్టి పెట్టి కేసులు రాజీకి ప్రయత్నం చేయాలన్నారు. ఈ సమావేశంలో ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి అబ్రహాం, ఏపీపీ జన్ను భద్రయ్య మధిర రూరల్ పట్టణ సిఐ లు డీ. మధు, డీ. రమేశ్, మధిర సర్కిల్ పరిధిలోని ఎస్ఐ లు బి లక్ష్మి భార్గవి, రమేశ్, వెంకన్న, తల్లాడ వైరా ఎస్సైలు వెంకటేశ్ కృష్ణ, రామారావు సి. జనార్ధన్ రెడ్డి, మధిర వైరా ఎక్సైజ్ సర్కిల్ శాఖల అధికారులు సాయి రామ్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు బి. పుల్లారావు, వాసంశెట్టి కొటేశ్వరరావు , రామరాజు, వి. మాధురి తేజ కోర్టు సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.






