- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓయూకు నిధులివ్వడం చారిత్రాత్మకం
గత పాలకులంతా ఉస్మానియా యూనివర్సిటీపై కపట ప్రేమను ప్రదర్శిస్తూ లబ్ధి పొందారే తప్ప దాని అభివృద్ధి గురించి ఏనాడు పట్టించుకోలేదని తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న పేర్కొన్నారు.

దిశ, తుంగతుర్తి: గత పాలకులంతా ఉస్మానియా యూనివర్సిటీపై కపట ప్రేమను ప్రదర్శిస్తూ లబ్ధి పొందారే తప్ప దాని అభివృద్ధి గురించి ఏనాడు పట్టించుకోలేదని తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న పేర్కొన్నారు. ఆయన శనివారం మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.గత పదేళ్లలో దుర్మార్గ పాలన కొనసాగిందన్నారు.తెలంగాణ ఉద్యమంలో ఓయూ విద్యార్థుల పాత్ర కీలకమైనప్పటికీ దాన్ని అభివృద్ధి చేయడంలో మాత్రం నాటి పాలకులు వైఫల్యం చెందారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి ఓయూపై ప్రత్యేక దృష్టి సారించారని పేర్కొన్నారు. ప్రత్యేకంగా భవన నిర్మాణాలు,ఫ్యాకల్టీ ఏర్పాటుకు రూ.వేయి కోట్లు మంజూరు చేశారని తెలిపారు. నిన్నగాక మొన్న రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమీట్ నిర్వహించి రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులను తీసుకొచ్చారని వివరించారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు విస్తరింప చేశాడని వెల్లడించారు.
- Tags
- nalgonda






