- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బయటపడ్డ మావోయిస్టుల షాకింగ్ వీడియో.. పోలీసులకు సవాల్ చేసి మరీ..
మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు జూలై 28 నుండి ఆగస్టు 3 వరకు జరిగాయి.

దిశ,భద్రాచలం : మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు జూలై 28 నుండి ఆగస్టు 3 వరకు జరిగాయి. వారోత్సవాలను భగ్నం చేయడానికి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అడుగడుగునా భద్రతా బలగాలు మోహరించారు. మావోయిస్టు వారోత్సవాలను నిర్వహించకుండా అడ్డుకోగలిగామని పోలీసులు భావిస్తున్న తరుణంలో, వారోత్సవాలు ముగిసిన నాలుగు రోజులు తర్వాత తాము ఘనంగా నిర్వహించామని మావోయిస్టులు పేర్కొన్నారు. ఈ మేరకు ఏకంగా వారోత్సవాల వీడియోలను సైతం రిలీజ్ చేశారు. వేలాది మంది భద్రతా బలగాల కళ్ళుగప్పి వారోత్సవాలు నిర్వహించామని తెలుపుతూ వీడియోలు విడుదల చేయడం పోలీసులను సవాల్ చేసినట్లుగా కొందరు భావిస్తున్నారు.
ఈ వీడియోలలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు, గిరిజనులు, సానుభూతిపరులు నృత్యం చేస్తున్నట్లు, ర్యాలీ నిర్వహించినట్లు ఉన్నాయి. భద్రతా బలగాల చేతిలో హత్యకు గురైన మావోయిస్టు అగ్ర నాయకుడు బసవరాజ్, ఇతర సహచరులకు కొత్త స్మారక చిహ్నాన్ని నిర్మించారు. ఆగస్టు 1,2 తేదీలలో నక్సలైట్లు బస్తర్ అంతటా అమరవీరుల వారోత్సవాన్ని జరుపుకున్నట్లుగా తెలుస్తుంది.






