- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీసులను టార్గెట్ చేయబోయి.. గాయపడ్డ మావోయిస్టు
by velandi.Saikiran |
భద్రతా బలగాలను మట్టుబెట్టడానికి ఐఈడీ అమరుస్తుండగా.. అది పొరపాటున పేలడంతో మహిళా మావోయిస్టు తీవ్రంగా గాయపడిన

X
దిశ, భద్రాచలం: భద్రతా బలగాలను మట్టుబెట్టడానికి ఐఈడీ అమరుస్తుండగా.. అది పొరపాటున పేలడంతో మహిళా మావోయిస్టు తీవ్రంగా గాయపడిన సంఘటన బీజాపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. మద్దెడ్ పోలీస్టేషన్ పరిధిలోని బందెపార అటవీ ప్రాంతంలో గుజ్జ సోది అనే మహిళా మావోయిస్టు, తోటి మావోయిస్టులతో కలిసి భద్రతా బలగాలే లక్ష్యంగా ఐఈడీ అమర్చడానికి వచ్చారు.
అయితే, ప్రమాదవ శాత్తు ఆ ఐఈడీ పేలింది. ఈ సంఘటనలో మావోయిస్టు సోదికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన మావోయిస్టు సోదిని అక్కడే వదిలేసి, మిగతా మావోలు భయంతో అడవిలోకి వెళ్లిపోయారు. ఇది చూసిన గ్రామస్థులు, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకొని, గాయపడిన మహిళా మావోయిస్టును హాస్పిటల్ కు తరలించారు పోలీసులు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






