లేఖ విడుదల చేసిన రోజే లొంగిపోయిన మావోయిస్టు అనంత్‌

by velandi.Saikiran |

ఎంఎంసీ ప్రతినిధి అనంత్ లొంగిపోయారు. జనవరి 1లోగా లొంగిపోతామని మావోయిస్టులు ప్రకటించిన రోజే, అనూహ్య పరిణామాలు

లేఖ విడుదల చేసిన రోజే లొంగిపోయిన మావోయిస్టు అనంత్‌
X

లేఖ విడుదల చేసిన రోజే లొంగిపోయిన‌ అనంత్

అతనితో పాటు 15 మంది

దిశ, భద్రాచలం: మావోయిస్టు నేత, ఎంఎంసీ ప్రతినిధి అనంత్ లొంగిపోయారు. జనవరి 1లోగా లొంగిపోతామని మావోయిస్టులు ప్రకటించిన రోజే, అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛ‌త్తీస్ ఘ‌డ్‌ స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి అనంత్, పోలీసుల ముందు లొంగిపోయాడు. తన సహచరులు 15 మందితో కలిసి లొంగిపోయాడు మావోయిస్టు నేత, ఎంఎంసీ ప్రతినిధి అనంత్. మహారాష్ట్ర గొందియ పోలీసుల ఎదుట ఏంఏంసి స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికాస్ నాగపురే అలియాస్ అనంత్ తన 15 మంది సభ్యులతో కలిసి లొంగిపోవడం సంచలనంగా మారింది. జనవరి ఒకటవ తేదీ వరకు అందరం లొంగిపోతామని గురువారం లేఖను విడుదల చేశారు అనంత్. అయితే, ఎవ‌రూ ఊహించ‌ని విధంగా అదేరోజు అనంత్‌ లొంగిపోవడం వెనుక కారణాలు ఏమై ఉంటాయానే చర్చ జరుగుతుంది. మరోవైపు మావోయిస్టు అగ్రనేత శ్యాం దాదా కూడా లొంగిపోయారు.

Next Story