- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మామిడి తినేవాళ్లకు అలర్ట్..పైన నిగనిగ...లోపల విషం.!
వేసవి వచ్చిందంటే మామిడి పండ్లు సీజన్ మొదలవుతుంది.

పైన నిగనిగ...లోపల విషం.!
రసాయనాలతో మామిడికాయలు మగ్గిస్తున్న వైనం
ప్రజల ప్రాణాలతో చెలగాటం
తల్లాడలో ఇష్టారాజ్యంగా దళారులు
తల్లాడ మండలంలో కొందరు దళారులు మ్యాంగో మార్కెటింగ్ ఎక్స్‌పోర్ట్ పేరుతో మామిడి పండ్లను రసాయనాలతో గంటల్లోనే మగ్గిస్తూ.. ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ, సొమ్ము చేసుకుంటున్నాడు. స్థానికంగా సైతం భారీగా విక్రయిస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ లాభం పొందడానికి ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారు. ఫుడ్ సేఫ్టీ నిబంధన ప్రకారం ప్రమాదకర రసాయనాలతో పండ్లను మగ్గ పెట్టడం నిషేధం ఉన్నా.. కొన్ని గోధుమల్లో యథేచ్ఛగా ఈ ప్రక్రియ కొనసాగుతున్నది. మామిడి పండ్లు బాక్స్‌లలో ప్యాకింగ్ చేసే సమయంలో బహిరంగంగానే రసాయనాలను పేపర్‌లో చుట్టి పంపిస్తున్నారు. వీటిని తింటే ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యుల హెచ్చరిస్తున్నారు.
దిశ, తల్లాడ: వేసవి వచ్చిందంటే మామిడి పండ్లు సీజన్ మొదలవుతుంది. ఇప్పుడు మార్కెట్లో కనిపిస్తున్న మెరిసే మామిడి పండ్ల వెనుక ప్రమాదకర నిజాలు బయటపడుతున్నాయి. తల్లాడ మండలం పరిధిలోని నేషనల్ హైవే పక్కనున్న గాంధీనగర్ తండా సమీపంలో కొందరు మ్యాంగో మార్కెటింగ్ ఎక్స్‌పోర్ట్ పేరుతో మామిడి పండ్లను రసాయనాలతో గంటల్లోనే మగ్గిస్తూ.. ఇతర రాష్ట్రాలకు లారీలతో తరలిస్తూ, సొమ్ము చేసుకుంటున్నాడు. స్థానికంగా సైతం రసాయనాలతో మగ్గిస్తున్న పండ్లను భారీగా విక్రయిస్తున్నట్లు తెలుస్తున్నది. సహజంగా మగ్గిన మామిడి పండ్ల పేరుతో విక్రయిస్తున్నా.. కొనుగోలు చేసిన వారు వాసన, రుచి, నాణ్యత అంతగా ఉండటం లేదని చెబుతున్నారు.
ప్రజల ప్రాణాలు పణంగా
తక్కువ సమయంలో ఎక్కువ లాభం పొందడానికి కొందరు వ్యాపారులు ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారు. ఫుడ్ సేఫ్టీ నిబంధన ప్రకారం ప్రమాదకర రసాయనాలతో పండ్లను మగ్గ పెట్టడం నిషేధం ఉన్నా.. కొన్ని గోధుమల్లో యథేచ్ఛగా ఈ ప్రక్రియ కొనసాగుతున్నది. మామిడి పండ్లు బాక్స్‌లలో ప్యాకింగ్ చేసే సమయంలో బహిరంగంగానే రసాయనాలను పేపర్‌లో చుట్టి పంపిస్తున్నారు. అధికారులు తనిఖీలు చేపట్టకపోవడంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రసాయనాలతో మగ్గించిన పండ్లు తింటే కడుపునొప్పి, వాంతులు, అలర్జీ, జీర్ణ వ్యవస్థ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యుల హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు వృద్ధులు ఆరోగ్యం పై తీవ్రప్రభ పడే అవకాశం ఉందని చెబుతున్నారు.
రసాయనాలతో మగ్గిస్తే చర్యలు తప్పవు
జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి కిరణ్
మామిడి పండ్లను కృత్రిమ పక్వత (కల్తీ) రసాయనాలు (కార్బైడ్) వాడితే కఠిన చర్యలు తప్పవు. తనిఖీల్లో రసాయనాలు ప్యాకెట్లు దొరికితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. సాధారణ పద్ధతిలోనే మామిడి పండ్లను ప్యాకింగ్ చేయాలి. దీనికి విరుద్ధంగా దళారులు అక్రమ రసాయనాలు కలిపితే చర్యలు తప్పువు.






