రేవంత్ రెడ్డి... పెన్షన్ పెంచుతావా...రాజీనామా చేస్తావా ?

by velandi.Saikiran |   (  Updated:2025-08-30 16:10:40  IST  )

పెన్షన్ పెంచుతామని మాయమాటలు చెప్పి... గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం నేటి వరకు వారి సమస్యలపై మాట్లాడకపోవడం

రేవంత్ రెడ్డి... పెన్షన్ పెంచుతావా...రాజీనామా చేస్తావా ?
X

దిశ, కల్లూరు : పెన్షన్ పెంచుతామని మాయమాటలు చెప్పి.. గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం నేటి వరకు వారి సమస్యలపై మాట్లాడకపోవడం బాధాకరమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ... రేవంత్ రెడ్డి సర్కారుపై విమర్శలు గుప్పించారు. శనివారం ఖమ్మం జిల్లా, కల్లూరు పట్టణ కేంద్రంలో నిర్వహించిన పెన్షన్ దారుల సన్నాహాక సదస్సులో ఆయన... రేవంత్ రెడ్డి పై నిప్పులు చెరిగారు. 65 లక్షల మంది పెన్షన్ దారుల సమస్యలు మీకు పట్టవా అంటూ రేవంత్ రెడ్డి సర్కారును నిలదీశారు.

ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఉచితంగా గుండె ఆపరేషన్లు జరిపించే ఆరోగ్యశ్రీ పథకం ఎక్కడా లేదని అన్నారు. కులాలకు, మతాలకు సంబంధం లేకుండా పేద బిడ్డలకు కార్పొరేట్ హాస్పిటల్లో ఉచితంగా గుండె ఆపరేషన్లు జరిపించే రాష్ట్రాలు కేవలం తెలుగు రాష్ట్రాలే అని అందుకు కారణం ఎమ్మార్పీఎస్ పోరాట ఫలితమే అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 4వేల రూపాయలకు పెన్షన్ పెంచుతానని రేవంత్ రెడ్డి మాట ఇచ్చి నేటి వరకు అది నెరవేర్చలేదని దుయ్యబట్టారు. 2024 ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం వృద్ధులకు 4 వేలు ,వికలాంగులకు 6 వేలు నూరు శాతం అంగవైకల్యం కలిగిన వాళ్లకి 15 వేల పెన్షన్ ఇస్తున్నాడని గుర్తు చేశారు.

పెన్షన్ దారులకు పెన్షన్ పెంచాలనే డిమాండ్ తో జులై 15 నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సన్నాహా సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు కారుమంచి వెంకటేశ్వర్లు, జాతీయ మహిళా నాయకురాలు సామినేని భవాని చౌదరి, నాయకులు మాగంటి వెంకటేశ్వర్లు, సీతారెడ్డి, కొరకొప్పుల రాణి, కంచిపోగులక్ష్మి, గొల్లమందల ముత్తారావు ,దారెల్లి వెంకటేశ్వరరావు, నల్లగట్ల కోటేశ్వరరావు, నల్లగట్ల వేణు, యంగల వెంకటేశ్వర్లు, యంగల పెంటయ్య,ఖమ్మంపాటి పుల్లారావు, ఆదూరి కిరణ్, ఖమ్మంపాటి బాబురావు, కొత్తపల్లి వెంకటేశ్వర్లు, బొక్క వెంకటేశ్వర్లు, ఇనుపలూరి వెంకటేశ్వర్లు, నందిగం ప్రసాద్, మాగంటి శ్రీనివాస్, నామా వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు..

Next Story