- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి..
by Kodari Anjali |
విద్యుత్ షాక్‌కు గురై వ్యక్తి మరణించిన ఘటన చిన్నరాజుపేట గ్రామంలో జరిగింది.

X
దిశ, పినపాక: పినపాక మండల పరిధిలో విద్యుత్ షాక్‌కి గురై మరణించిన సంఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. మల్లారం గ్రామపంచాయతి చిన్నరాజుపేట గ్రామానికి చెందిన పోలెబోయిన పొట్టెయ్య (65) ఇంట్లోని సర్వీస్ వైర్‌ని ఎలుకలు కొట్టిన విషయం గమనించకపోవడంతో ఈ సంఘటన జరిగింది. విద్యుత్ శాఖా ఏఈ జి.వేణుగోపాల్ వివరాల ప్రకారం… ఇంట్లోని సర్వీస్ వైర్‌ని ఎలుకలు కొరకడం వల్ల ఇన్స్టాలేషన్ ఊడిపోయిందన్నారు. పొట్టెయ్య ఇంట్లో బట్టలారేసుకోవడానికి ఉపయోగించే జీఐ విద్యుత్ వైర్ ఇన్స్టలేషన్ తెగిపోయిన సర్వీస్ వైర్‌ని తాకింది. ఇది గమనించని పొట్టయ్య జీఐ వైర్‌ను తాకడంతో మృతి చెందినట్లు తెలిపారు.
Next Story






