- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి
by Naveena |

X
దిశ, ఖమ్మం రూరల్ : ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం రూరల్ మండలం గుదిమళ్ల గ్రామానికి చెందిన చెరుకుపల్లి నర్సింహారావు (47) గుదిమళ్ల గ్రామ పరిధిలో ఓ ఇటుక బట్టీలో పని చేస్తున్నాడు. రోజులాగే సోమవారం పనికి వెళ్లి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా.. అదుపుతప్పి కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో నర్సింహారావు తలకి తీవ్ర గాయాలు కావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘనట స్థలానికి వెళ్లి మృతుడి మృతదేహాన్ని ఖమ్మం సిటీలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించారు.
Next Story