- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట గాంధీనగర్ (ఫైర్ కాలనీ)కి చెందిన కాటం రాజు(28) అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక వ్యవసాయ కళాశాలలో వాచ్ మెన్ గా పని చేసే కాటంరాజుకు కొత్తగూడెంకు చెందిన శ్రావణితో ఆరేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి మూడు సంవత్సరాల కూతురు ఉంది. ప్రస్తుతం భార్య గర్భవతి కావడంతో పుట్టింటికి వెళ్లడంతో ఒంటరిగా ఉంటున్న కాటంరాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్నపాటి ఆర్థిక ఇబ్బందులు ఆత్మహత్యకు గల కారణంగా తెలుస్తుంది.
Next Story






