- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాలోత్ మంజులకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు
by velandi.Saikiran |
కామేపల్లి బాలికల ఆశ్రమ పాఠశాల టీచర్ మాలోత్ మంజుల ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ప్రశంస పత్రం అందుకున్నారు. శుక్రవారం

X
దిశ, కారేపల్లి: కామేపల్లి బాలికల ఆశ్రమ పాఠశాల టీచర్ మాలోత్ మంజుల ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ప్రశంస పత్రం అందుకున్నారు. శుక్రవారం ఐటిడిఏ కార్యాలయంలో జరిగిన గురుపూజోత్సవంలో ఐటీడీఏ పీవో చేతుల మీదుగా మంజుల ప్రశంస పత్రాన్ని తీసుకున్నారు. కారేపల్లి మండలం సూర్యతండకు చెందిన మాలోత్ మంజుల కామేపల్లి ఆశ్రమ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా సాంఘిక శాస్త్రం బోధిస్తున్నారు. మంజుల మూడు ఏళ్లుగా ఆ సబ్జెక్టులో నూరు శాతం ఫలితాలు అందిస్తూ ఉత్తమ అవార్డులు అందుకుంటున్నారు. వృత్తిపట్ల నిబద్ధత పని చేస్తూ విద్యార్థుల ప్రేమను, అధికారుల మన్నలను పొందుతున్నారు, మంజుల కు ఉత్తమ అవార్డు రావడం పట్ల ఉపాధ్యాయ సంఘాల నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు శుభాకాంక్షలు తెలిపారు.
Next Story






