- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎస్ కే యం సదస్సును జయప్రదం చేయండి
ఈనెల 10వ తేదీన ఉదయం 10 గంటలకు ఖమ్మంలోని రామ నరసయ్య విజ్ఞాన కేంద్రంలో సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్ కే యం)

దిశ, ఖమ్మం రూరల్: ఈనెల 10వ తేదీన ఉదయం 10 గంటలకు ఖమ్మంలోని రామ నరసయ్య విజ్ఞాన కేంద్రంలో సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్ కే యం) ఆధ్వర్యంలో జరిగే సదస్సును జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ పిలుపునిచ్చారు. ఆదివారం ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 31 వ డివిజన్లో (ఏఐకేఎస్) రైతు సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ...కేంద్ర ప్రభుత్వం పత్తిపై 11% దిగుమతి సుంకాన్ని అమలు చేయాలన్నారు . అలాగే క్వింటాకు రూ. 10075 మద్దతు ధర చెల్లించాలన్నారు . అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పెసర, పత్తి పంటకి తక్షణమే నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే ఆ సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వాలు దృష్టి సారించాలన్నారు . అనంతరం సంబంధిత కరపత్రాన్ని ఆవిష్కరించారు .ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొండపర్తి గోవిందరావు, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిడకంటి చిన్న వెంకటరెడ్డి, జిల్లా నాయకులు మామిడి శంకర్ రెడ్డి, మామిడి శ్రీనాథ్ రెడ్డి, మండల నాయకులు మిడకంటి పెద్ద వెంకట్ రెడ్డి, దొంతగాని వెంకన్న, ఘనపరపు నాగయ్య, పొన్నెకంటి రామకృష్ణ , ఏర్పుల లింగయ్య ,బొడ్డు ఉపేందర్ ,ఘనపరపు వీరన్న ,మామిడాల కిరణ్ ,మేళ్లచెరువు రవి ,మేళ్లచెరువు గురవయ్య, బుద్ధి వెంకన్న ,చల్లారాములు ,ఏర్పుల రాములు తదితరులు పాల్గొన్నారు.






