- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యుత్ సేవలతో గిరిజన రైతులకు మహర్దశ
మండలంలోని రైతు వేదిక లో ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక రైతు వారం ప్రోగ్రాం నిర్వహించారు.

దిశ, ఏన్కూర్ : మండలంలోని రైతు వేదిక లో ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక రైతు వారం ప్రోగ్రాం నిర్వహించారు. గిరిజన రైతులకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు అందజేయడంలో విద్యుత్ శాఖ ముందు ఉండి పని చేయడం జరిగిందని ఏన్కూర్ విద్యుత్ శాఖ, ఉమాకాంత్ తెలిపారు. వ్యవసాయ క్షేత్రాలు -సౌర విద్యుత్ కేంద్రాలు అంశం పై అవగాహన నిర్వహించారు. మోడల్ సోలార్ విలేజెస్ పీఎం కొసం కాంపోనెంట్ 1 కాంపోనెంట్ 2 స్కీముల గురించి టీజీఎన్ పీడీసీల్ విద్యుత్ శాఖలోని భద్రత నా గురించి వాటి ప్రయోజనాలు గురించి వివరించారు. ఇప్పటి వరకు పీఎం సూర్యాఘర్ స్కీమ్ ద్వారా 80 కనెక్షన్లు ఎస్ టి,ఫార్మర్స్ ప్రాజెక్ట్ ద్వారా 3కిమీ లైన్ గంగులనచారం వేయడం జరిగింది. అగ్రికల్చర్ సర్వీస్ లు 80 కనెక్షన్లు రిలీజ్ చేశామని తెలిపారు. శ్రీరామగిరి పంచాయతీ లో 249 సోలార్ ప్లాంటల పని ప్రారంభం అయింది. అలాగే ఓవర్ లాడ్ ట్రాన్స్ఫార్మర్ లు ఏన్కూర్, తిమ్మరావుపేట, గార్లోడు, బీ.ఆర్. పుర ఏర్పాటు చేసినట్టు ఏఈ ఉమాకాంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్, లచ్చి రామ్ నాయక్, ఏఓ,నరసింహారావు, కాంగ్రెస్ నాయకులు, మేడ ధర్మారావు, గార్ల ఓడ్డు ఉపసర్పంచ్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.






