బూర్గంపహాడ్ వైపు ముంపు నష్టం లేకుండా చూడండి

by Nallavelli.Anjaneyulu |

గోదావరి ముంపు బారి నుంచి భద్రాచలంతో పాటు, బూర్గంపహాడ్ వైపు గ్రామాలను కూడా రక్షించాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ గాంధీ పదం అధ్యక్షులు డాక్టర్ బూసిరెడ్డి శంకర్ రెడ్డి పేర్కొన్నారు.

బూర్గంపహాడ్ వైపు ముంపు నష్టం  లేకుండా చూడండి
X

దిశ, భద్రాచలం : గోదావరి ముంపు బారి నుంచి భద్రాచలంతో పాటు, బూర్గంపహాడ్ వైపు గ్రామాలను కూడా రక్షించాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ గాంధీ పదం అధ్యక్షులు డాక్టర్ బూసిరెడ్డి శంకర్ రెడ్డి పేర్కొన్నారు. బూర్గంపహాడ్ వైపు కూడా కరకట్ట నిర్మాణం చేపట్టాలని ఆయన మంత్రి తుమ్మల నాగేశ్వరావు ను కోరారు. భద్రాచలం పట్టణాన్ని వరదల నుంచి రక్షించేందుకు నిర్మించిన రక్షణ గోడలో ఏర్పడిన పగుళ్ళను, ఎట్టపాక వైపు కూడా కరకట్టను ఎత్తు పెంచకపోతే ఎటపాక గ్రామం నుండి గోదావరి వరద పొంగి భద్రాచలం మీద పడి భవిష్యత్తులో భద్రాచలం తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు అన్నీ జలమయంతో భారీ ముంపుకు గురై వందలాది మంది ప్రాణ నష్టాలకు దారితీసే అవకాశమూ ఉంది. భద్రాచలం వైపు ఉన్న కరకట్ట పటిష్టం తో పాటు బూర్గంపహాడ్ మండలం వైపు కూడా యుద్ధ ప్రాతిపదికన కరకట్ట నిర్మించాల్సిన అవసరం ఉందని శంకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. బూర్గంపహాడ్ వైపు కరకట్ట నిర్మించకపోతే బూర్గంపాడు, సంజీవరెడ్డి పాలెం,నాగినేని ప్రోలు రెడ్డిపాలెం,గుమ్మూరు కాలనీ, సారపాక,తాళ్లగుమ్మూరు కోయగూడెం, మోతే,ఇరవండీ,నెల్లిపాక బంజరు తదితర గ్రామాలన్నీ జలప్రళయానికి లోనయ్యే అవకాశాలు తీవ్రంగా ఉన్నాయని, ఆసియా ఖండంలోనే సుమారు పదివేల మందికి ఉపాధి కల్పిస్తున్న ఐ టి సి పేపర్ కర్మాగారం కూడా ముంపున‌కు గురయ్యే అవకాశం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story