ఈజీఎస్‌లో లాంగ్ స్టాండింగ్.. కనీసం పట్టించుకోని జిల్లా ఉన్నతాధికారులు

by I. Sairam |

ప్రభుత్వ శాఖలో ఏ ఉద్యోగి అయినా మూడు సంవత్సరాల తర్వాత బదిలీ అవుతారు.

ఈజీఎస్‌లో లాంగ్ స్టాండింగ్..  కనీసం పట్టించుకోని జిల్లా ఉన్నతాధికారులు
X

దిశ, వైరా: ప్రభుత్వ శాఖలో ఏ ఉద్యోగి అయినా మూడు సంవత్సరాల తర్వాత బదిలీ అవుతారు. వైరా మండల ఈజీఎస్ కు ఈ నిబంధనలను వర్తించడం లేదు. ఒకటి కాదు రెండు కాదు.... ఏకంగా 10 సంవత్సరాల పాటు ఒకే అధికారి ఓ శాఖలో పని చేయడం విస్మయానికి గురి చేస్తోంది. సామాన్య ఉద్యోగికి ఉన్న నిబంధనలు మండల స్థాయి అధికారికి వర్తించకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. వైరా మండలంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గత పది ఏళ్లగా ఏపీవోగా అనురాధ పనిచేస్తున్నారు. ఆమెకు కనీసం ప్రభుత్వ నిబంధనలు వర్తించడం లేదు. అంతేకాకుండా మండల వ్యాప్తంగా ఆమె ఇష్టారాజ్యంగా ఈజీ ఎస్ పనులు చేపిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. గ్రామ పంచాయతీలకు సంబంధించిన నర్సరీలకు ఎర్రమట్టి, ఇసుకను గ్రామపంచాయతీ నిధులతోనే తోలాలని ఆమె షరతులు విధిస్తోంది.

గత పది సంవత్సరాలుగా ఇదే తంతు కొనసాగుతోంది. ఈజీఎస్ ఎస్టిమేట్‌లో ఉన్న ఎర్రమట్టి, ఇసుకను మేము ఎందుకు తోలించాలని సర్పంచ్లు ప్రశ్నిస్తున్నారు. గ్రామ పంచాయతీ ఖాతాల్లో ఆమె నగదు జమ చేయడం లేదు. ఒక్కో గ్రామ పంచాయతీకి కేవలం నర్సరీ కోసం రూ.20 వేల నుంచి రూ.30 వేలు ఖర్చు చేపిస్తున్నారు. కొన్ని పంచాయితీలకు వీటికి సంబంధించి రూ.5 వేలు నుంచి రూ. 10 వేలు మాత్రమే చెల్లిస్తున్నట్లు తెలిసింది. ఇంత జరుగుతున్న జిల్లా కలెక్టర్ కనీసం పట్టించుకోకపోవడం విశేషం. లాంగ్ స్టాండింగ్‌లో ఉన్న ఒక అధికారి ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్న పట్టించుకోకపోవడం విశేషం. అతి త్వరలో గ్రామ పంచాయితీ సర్పంచులు ఈ వ్యవహారం పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తారని తెలిసింది. ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారో లేదా అని తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే.

Next Story