స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం

by velandi.Saikiran |

మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వ‌హించారు పినపాక

స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం
X

దిశ, కరకగూడెం : మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వ‌హించారు పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు. ఈ సందర్బంగా ఆయ‌న‌ మాట్లాడుతూ మండల స్థాయి నాయకులు, కార్యకర్తలే కాంగ్రెస్‌ పార్టీకి బలమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ జెండా వారివ‌ల్లే ఎగిరిందని గుర్తు చేశారు.

సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం నిధులు ఖర్చు చేస్తోందన్నారు. విద్యార్థి దశ నుండి ఇక్కడే ఉండి పనిచేస్తూ ఈ స్థాయికి వచ్చానని తెలిపారు. పార్టీకి నష్టం కల్పించే వారిని ఉపేక్షించేది లేదని తెలియజేశారు. కరకగూడెం మండలం లో 16 సర్పంచులు, 5 ఎంపీటీసీ లు, జడ్పీటీసీ, ఎంపీపీ లు పోటీ చేయనున్నారని వెల్ల‌డించారు. ఈ ఎన్నికల్లో మ‌న పార్టీ జెండా ఎగుర‌వేయాల‌ని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో పిసిసి మెంబర్ చందా సంతోష్, మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, తొలెం నాగేశ్వరరావు, పోలెబోయిన తిరుపతయ్య, యర్రా సురేష్, బిజ్జ రామనాథం, జలగం కృష్ణ, కుంజ వసంతరావు, నాగ బండి వెంకటేశ్వర్లు, పడిగా సమ్మయ్య, గొగ్గాలి రవి, భూక్యా రాందాస్, కర్కపల్లి నాగేష్, సోలంకేశవరావు, కునుసూత్ సాగర్, ఇరుప రవి, పూణేం బుచ్చయ్య, వాసిరెడ్డి నేతాజీ,కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story