బెల్టు జోరు...అధికారుల కనుసన్నల్లోనే

by velandi.Saikiran |

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో దాదాపు ప్రతి కిరాణా షాపు ఒక బెల్ట్ షాపుగా మారి ఎమ్మార్పీ ధరలకు మార్కెట్లో దొరకాల్సిన మద్యాన్

బెల్టు జోరు...అధికారుల కనుసన్నల్లోనే
X

బెల్టు జోరు

=కోడ్ కూసినా.. ఆగనిబెల్టు దందా

=కిరాణ దుకాణాల మాటున మద్యం సిట్టింగ్‌

=అధికారుల కనుసన్నల్లోనే వ్యవహారం ?

దిశ, కారేపల్లి రూరల్: కారేపల్లి మండల పరిధిలోని పలు గ్రామపంచాయతీల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉందా ..? లేదా ..? అనే అనుమానం కలుగుతోంది. నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా వైన్స్ షాపుల నుంచి బెల్టుషాపుల నిర్వాహకులు గ్రామాల్లోని బెల్ట్‌షాపులకు, బైకుల ద్వారా యథేచ్ఛగా మద్యం తీసుకు వెళ్తూ మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. అన్ని విషయాల్లో కోడ్‌ అమలు చేస్తున్న అధికారులు మద్యం విషయంలో మీనమేషాలు లెక్కిస్తూ లోపాయికారీగా వైన్స్ యాజమాన్యానికి సహకరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కోడ్ నిరంతరం నిఘా ఉన్నప్పటికీ ఎక్సైజ్, పోలీస్ శాఖల అధికారులు ఎన్నికల డ్యూటీలో గస్తీ కాస్తున్నా.. ఇంత ఈజీగా బెల్ట్ షాపులకు మద్యం సరఫరా ఎలా అవుతుందని? 24×7 బెల్ట్ షాపుల ద్వారా మద్యం విక్రయాలు ఎలా జరుగుతున్నాయని ప్రజలు మహిళలు ప్రశ్నిస్తున్నారు.

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో దాదాపు ప్రతి కిరాణా షాపు ఒక బెల్ట్ షాపుగా మారి ఎమ్మార్పీ ధరలకు మార్కెట్లో దొరకాల్సిన మద్యాన్ని రూ.30నుంచి రూ.50వరకు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. దీనిపై ఎవరూ నోరు మెదపకుండా చోద్యం చూస్తూ ఉండిపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అప్పుడప్పుడు చుట్టపు చూపుగా వచ్చి అడపాదడపా ఒకటి రెండు కేసులు నమోదు చేస్తున్నారని, కానీ, అందరికీ తెలిసే అధికారికంగా బెల్ట్ దందా జోరుగా నడుస్తుందని మద్యంప్రియులే బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు. మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో బెల్ట్‌షాపుల దందా జోరుగా సాగుతుంది. బెల్టు దుకాణాలకు మద్యం సరఫరాపై నిరంతర నిఘా కానరావడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం తరలిస్తే సీజ్‌ చేసే అధికార యంత్రాంగం, బెల్ట్‌ షాపులకు మద్యం సరఫరా అవుతున్నా ఎందుకు ఫోకస్‌ చేయడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కోడ్‌ ఉండటంతో పరిమితంగా మాత్రమే తీసుకెళ్లడానికి అనుమతి ఉంటుంది.అడ్డూ అదుపు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా వైన్స్‌ల నుంచి మద్యం, బీర్లు బహిరంగంగానే మారుమూల ప్రాంతాల్లోని బెల్ట్‌ షాపులకు తరలిస్తుండటంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కారేపల్లి మండల కేంద్రంలో కొన్ని గ్రామాల్లో అలాగే, మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్, సినిమా టాకీస్ సమీప ప్రాంతాలలో బెల్ట్ షాపులు పుట్టగొడుగుల్లా వెలిశాయి. ఎల్లవేళలా ఇక్కడ మద్యం అందుబాటులో ఉంటుందని మద్యం ప్రియులే చెబుతున్నారు. మండలంలోని భాగ్యనగర తండా, సూర్యతండ, ఉసిరికాయలపల్లి, చీమలపాడు, సీతారాంపురం, లావుడియా తండా తదితర గ్రామాల్లో బెల్ట్ నిర్వాహకులు కోడి కూత కూయకముందే మద్యం విక్రయాలు జరుపుతున్నారు. ఎక్సైజ్‌ అధికారుల కనుసన్నల్లోనే మద్యం దందా జరుగుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు స్పందించి బె

Next Story