- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు..
హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదుతో పాటు కోర్టు పదివేల రూపాయల జరిమానా కూడా విధించింది.

దిశ, ఖమ్మం క్రైం: హత్య కేసులో వరంగల్ జిల్లా, ధర్మసాగర్ మండలం, పెద్ద పెండ్యాల గ్రామానికి చెందిన రాప్రోలు వెంకటేశ్వర్లు @ రాజు(32)కు జీవిత ఖైదు, 10 వేలరూపాయలు జరిమానా విధిస్తూ నాలుగోవ అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు గౌరవ న్యాయమూర్తి డా. జి.వి. మహేష్ నాథ్ తీర్పు వెల్లడించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. 2021 ఫిబ్రవరి 13 న రాత్రి సమయంలో ఖమ్మం నగరంలో వినోద్ థియేటర్ వద్ద ఓ వివహితతో మాట్లాడుతున్న శీలం వెంకటేష్ అనే వ్యక్తిపై రాప్రోలు వెంకటేశ్వర్లు అనే వ్యక్తి పాత కక్ష పెంచుకొని హత్య చేసేందుకు కత్తితో పొడిచి పారిపోయాడు. బాధితుడి బంధువు అయిన ఇచ్చిన ఫిర్యాదుతో ఖమ్మం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాపు పూర్తి చేసి అభియోగ పత్రాన్ని న్యాయం స్థానంలో సమర్పించగా.. వాదోపవాదనలు విన్న న్యాయమూర్తిపై విధంగా తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌కు సహకరించిన పోలీసు అధికారులకు, ఇన్వెస్టీగేషన్ అధికారులు ఇన్స్పెక్టర్ చిట్టిబాబు, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి. స్వప్న, కోర్టు కానిస్టేబుల్ యం. రామకృష్ణ, కోర్టు లైజన్ ఎస్సై శ్రీకాంత్, హోంగార్డ్ శ్రీనివాస్ ను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు.






