- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గెలుపు గుర్రాల వేట.. అభ్యర్థుల ఎంపికల్లో నేతలు బిజీ బిజీ
ఖమ్మం జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు గుర్రాల వేటలో ప్రధాన పార్టీలు బిజీబిజీగా మారాయి. పక్కాగా గెలిచే అభ్యర్థుల కోసం వెతుకుతున్నాయి. అంతేకాకుండా చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థుల కోసం వెతుకులాట ప్రారంభించారు.

ఖమ్మం జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు గుర్రాల వేటలో ప్రధాన పార్టీలు బిజీబిజీగా మారాయి. పక్కాగా గెలిచే అభ్యర్థుల కోసం వెతుకుతున్నాయి. అంతేకాకుండా చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థుల కోసం వెతుకులాట ప్రారంభించారు. నామినేషన్ల స్వీకరణకు గడువు 30వ తేదీతో ముగియనుండగా ఆయా పార్టీలు తమ అభ్యర్థులతో నామినేషన్ వేయించేందుకు సంసిద్ధమవుతున్నాయి. జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర, మంత్రి పొంగులేటి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికలు జరగనుండడంతో మధిర, ఏదులాపురం మున్సిపాలిటీలపై అందరి దృష్టి నెలకొంది. ఏదులాపురం మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ 18మంది అభ్యర్థులను ప్రకటించింది. జనరల్ స్థానంలో పోటీ చేసేందుకు అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో తర్జనభజన పడుతున్నారు. ముఖ్యంగా నామినేషన్ల దాఖలకు రెండు రోజులే గడువు ఉండటంతో ఎంపిక విషయమై ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
- దిశ, ఖమ్మం కార్పొరేషన్
దిశ,ఖమ్మం కార్పొరేషన్: జిల్లాలో మున్సిపల్ ఎన్నికల వేడి రాజకుంటున్న వేళ వివిధ రాజకీయ పార్టీలు పక్కాగా గెలిచే అభ్యర్థుల కోసం వెతుకుతున్నారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ బుధవారం ప్రారంభం కాగా శుక్రవారం 30వ తేదీతో ముగుస్తోంది. దీంతో వివిధ రాజకీయ పక్షాల నేతలు తమ అభ్యర్థులను నామినేషన్ వేయించేందుకు సంసిద్ధమవుతున్నారు. అంతేకాకుండా చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థుల కోసం వెతుకులాట ప్రారంభించారు. ఇప్పటికే రాజకీయ పార్టీల నేతలు వ్యూహాలు పన్నుతూ అభ్యర్థులను ఎంపిక ప్రక్రియలో జాగ్రత్త వహిస్తున్నారు. అయితే రిజర్వేషన్లు తారుమారు కావడం నేతలకు తలనొప్పిగా మారింది. జనరల్ స్థానంలో పోటీ చేసేందుకు అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో తర్జనభజన పడుతున్నారు ముఖ్యంగా నామినేషన్ల దాఖలకు రెండు రోజులే గడువు ఉండటంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
జిల్లాలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గం లో మున్సిపల్ ఎన్నికలు జరగనుండడంతో మధిర ఏదులాపురం మున్సిపాలిటీలపై అందరి దృష్టి నెలకొంది. ఏదులాపురం మున్సిపాలిటీ చైర్మన్ పదవి ఎస్సీ మహిళ కాగా మధిర మున్సిపాలిటీ చైర్మన్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. సత్తుపల్లి, వైరా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండగా ఆయా మున్సిపాలిటీ లలో విజయం ప్రతిష్టాత్మకంగా మారింది. సత్తుపల్లి మున్సిపాలిటీ చైర్మన్ పదవి జనరల్ మహిళకు రిజర్వు కాగా, ఇదే నియోజకవర్గంలోని కల్లూరు మున్సిపాలిటీ చైర్మన్ పదవి ఎస్టీ జనరల్ కు రిజర్వ్ అయింది. ఇక వైరా మున్సిపాలిటీ చైర్మన్ పదవి జనరల్ మహిళలకు రిజర్వ్ అయింది. కాగా సత్తుపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, వైరా మున్సిపాలిటీలో ఖమ్మం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రచారం చేస్తున్నారు. దీంతో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఏ దులాపురంలో రాజకీయ పక్ష నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మంత్రి పొంగులేటి ప్రాతినిధ్యం వహించటం కాంగ్రెస్ శ్రేణులకు కలిసి వచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ మాత్రమే 18 మంది అభ్యర్ధులను ప్రకటించారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు మున్సిపాలిటీ పరిధిలో సీపీఐకి కొంత బలం ఉంది.
ఒంటరిగానే కాంగ్రెస్ పోటీ
మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని సమాచారం. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ ఈసారి ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఇక బీఆర్ఎస్ సీపీఎంతో జతకలుస్తుందని అంటున్నారు. సీపీఐ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఇటీవల ప్రకటించారు. కాగా అభ్యర్థుల ఎంపిక, నామినేషన్ల దాఖలుకు రెండు రోజులు గడువు ఉండటంతో అభ్యర్థుల ఎంపికలో నేతలు తల మునకలువుతున్నారు.






