దిశ ఎఫెక్ట్ : వల్లాపురానికి ప్రత్యేక వైద్య బృందం

by Dishanational1 |
దిశ ఎఫెక్ట్ : వల్లాపురానికి ప్రత్యేక వైద్య బృందం
X

దిశ, వైరా: వైరా మండలంలోని వల్లాపురం గ్రామంలో ఫ్లూ జ్వరాలను నియంత్రించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మాలతిని ఆదేశించారు. "వల్లాపురాన్ని వణికిస్తున్న ఫ్లూ జ్వరాలు" అనే వార్త కథనం దిశ వెబ్ సైట్ లో మంగళవారం రాత్రి 9.17 గంటలకు ప్రచురితమైంది. ఈ వార్తా కథనం ప్రచురితమై గంట వ్యవధి కూడా గడవకముందే జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్ రాత్రి అని కూడా చూడకుండా తన ఉద్యోగ బాధ్యతలకు మరింత వన్నెతెస్తూ వెంటనే స్పందించారు. జిల్లా కలెక్టర్ వెంటనే జిల్లా వైద్యాధికారి మాలతీను వల్లాపురంలో ఫ్లూ జ్వరాలను అరికట్టేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

దీంతో వెంటనే జిల్లా వైద్యాధికారి మాలతి దిశ వైరా నియోజకవర్గ ఇన్చార్జితో ఫోన్లో మాట్లాడి జ్వరాలకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించారు. బుధవారం వల్లాపురం గ్రామంలో తమ వైద్య బృందం పర్యటిస్తుందని మాలతి స్పష్టం చేశారు. ఆ గ్రామంలో జ్వరాలను పూర్తిస్థాయిలో అరికట్టడానికి చర్యలు తీసుకుంటామన్నారు. సమస్య తెలిసిన గంటలోపే స్వయానా జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ రాత్రి సమయంలో స్పందించి జ్వరాలను అరికట్టేందుకు జిల్లా వైద్యాధికారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయటంతో విధుల పట్ల ఆయనకున్న ప్రత్యేక శ్రద్ధ మరోసారి కంటికి కనిపించినట్లు స్పష్టమైంది.



Next Story

Most Viewed