కొత్తగూడెం అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు సహకరించండి

by velandi.Saikiran |

కొత్తగూడెం పట్టణం, పరిసర ప్రాంతాల అభివృద్ధి, ప్రజలకు కావాల్సిన మౌలికవసతుల కల్పనకు సింగరేణి సంస్థ ద్వారా

కొత్తగూడెం అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు సహకరించండి
X

దిశ, కొత్తగూడెం: కొత్తగూడెం పట్టణం, పరిసర ప్రాంతాల అభివృద్ధి, ప్రజలకు కావాల్సిన మౌలికవసతుల కల్పనకు సింగరేణి సంస్థ ద్వారా సహకరించాలని శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు, సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాంను కలిసి కోరారు. మంగళవారం సంస్థ ప్రధానకార్యాలయంలో సి అండ్ ఏండిని కలిసి పలు ప్రతిపాదనలు ఆయన ముందుంచారు. ఈ సందర్బంగా కూనంనేని మాట్లాడుతూ జిల్లా కేంద్రమైన ఆర్టీసీ బస్టాండ్ నూతన భవనాలకు సంస్థ ద్వారా నిధులు మంజూరు చేయాలని కోరారు.

సిఎస్ఆర్ ఫండ్ సాధ్యమైనంత త్వరగా మంజూరు చేయాలనీ కోరారు కూనంనేని. సింగరేణి కార్మిక వాడలు, ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు కావల్సిన మౌలికవసతుల కల్పనకు యాజమాన్యం చొరవ చూపాలని పేర్కొన్నారు. రుద్రంపూర్, రామవరం తదితర ప్రాంతాల్లో మాజీ కార్మికులు నివసిస్తున్న క్వార్ట్రర్లను వారికే స్వాధీనంచేసి విద్యుత్, త్రాగునీటి వసతి కల్పించాలని కోరామన్నారు. కూనంనేని వెంట సిపిఐ, ఏఐటీయూసీ నాయకులు ఎస్ కె సాబీర్ పాషా, వంగ వెంకట్, రమణమూర్తి తదితరులు వున్నారు.

Next Story