- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శభాష్ ఎమ్మెల్యే సార్.. ప్రాణం పోసిన ఎమ్మెల్యే
అత్యవసర శస్త్ర చికిత్స కోసం భద్రాచలం ఏరియా వైద్యశాలకు రాగా...సర్జన్ అందుబాటులో లేరు. దీంతో స్వతహగా వైద్యుడైన భద్రాచలం శాసన సభ్యులు తెల్లం వెంకట్రావు ఐదు గంటలు కష్టపడి అతి క్లిష్టమైన శస్త్ర చికిత్స చేసి ఒక వ్యక్తికి ప్రాణ భిక్ష పెట్టారు.

దిశ, భద్రాచలం : అత్యవసర శస్త్ర చికిత్స కోసం భద్రాచలం ఏరియా వైద్యశాలకు రాగా...సర్జన్ అందుబాటులో లేరు. దీంతో స్వతహగా వైద్యుడైన భద్రాచలం శాసన సభ్యులు తెల్లం వెంకట్రావు ఐదు గంటలు కష్టపడి అతి క్లిష్టమైన శస్త్ర చికిత్స చేసి ఒక వ్యక్తికి ప్రాణ భిక్ష పెట్టారు. వివరాలలోకి వెళ్తే.... భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం, వెంకటాపురం మండలం, సుడిబాక గ్రామానికి చెందిన మడప భాస్కర్ అనే వ్యక్తికి విద్యుత్ షాక్ వలన 60 శాతం కాలిన గాయాలయ్యాయి. ఉన్న పొలాలు, బంగారం అమ్మి సుమారు రూ. 30 లక్షలతో హైదరాబాద్ లో చికిత్స అందించారు. ఆపరేషన్ చేయాలని అక్కడి వైద్యులు చెప్పడంతో ఉన్న ఆస్తులు మొత్తం అమ్ముకుని డబ్బులు లేక సొంత గ్రామానికి వచ్చేసారు. భాస్కర్ కుటుంభం దీన పరిస్థితిని గ్రహించిన ఎమ్మెల్యే వెంకట్రావు భద్రాచలం ఏరియా వైద్యశాలలో చేర్పించమని సలహా ఇచ్చారు. ఆపరేషన్ తక్షణమే చేయకపోతే ప్రాణానికి ప్రమాదం కావడంతో భాస్కర్ ను కుటుంబ సభ్యులు భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు. కానీ ఆపరేషన్ చేయడానికి సర్జన్ సమయానికి లేకపోవడంతో ఎం ఎస్ చదివిన ఎమ్మెల్యే వెంకట్రావు తానే స్వయంగా భాస్కర్ కు ఆపరేషన్ చేసి ప్రాణాలు రక్షించారు. ఇంతటి క్లిష్టమైన ఆపరేషన్ ఎమ్మెల్యే వెంకట్రావు తన చేతులు మీదుగా నిర్వహించి భాస్కర్ ప్రాణాలు నిలపడం అభినందనీయమని ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వై. రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.






