కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలి

by velandi.Saikiran |   (  Updated:2025-08-30 11:12:56  IST  )

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెప్టెంబర్ 10,11న అంటే రెండు రోజుల పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో

కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలి
X

దిశ ప్రతినిధి, కొత్తగూడెం: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెప్టెంబర్ 10,11న అంటే రెండు రోజుల పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారని.. ఈ పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వర రావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో రేగా కాంతారావు, వనమా వెంకటేశ్వర రావు ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో జరిగింది. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు తమ అభిప్రాయాలను నిక్కచ్చిగా తెలియజేశారు. పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలను గుర్తించాలని, పార్టీ టికెట్ పై గెలిచి తన వ్యక్తిగత అవసరాల కోసం పార్టీ మారిన వారిని మళ్ళీ తీసుకోవద్దని సూచించారు.

పార్టీ కోసం పని చేస్తున్న వారిని గుర్తించి వారికి భరోసా నిచ్చే విధంగా తోడ్పాటునందించాలని కోరారు. కేటిఆర్ పర్యటన వల్ల పార్టీ బలోపేతం కావడంతో పాటు కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం పెరుగుతుందని అన్నారు. అనంతరం రేగా కాంతారావు, వనమా మాట్లాడుతూ పార్టీ బలోపేతం కోసం అధిష్టానం సూచనలతో కమిటీ లను నియమిస్తామని, ఎవరు ఆ ధైర్య పడాల్సిన పని లేదని ప్రతీ కార్యకర్తను తాము గుర్తించుకొని అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ శ్రీమతి కాపు సీతా మహా లక్ష్మి , మాజీ వార్డు కౌన్సిలర్లు, ఉద్యమకారులు, ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story