- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొత్తూరు అంగన్‌వాడీ టీచర్ అగర్త మృతి
షుగర్, కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న అంగన్వాడీ టీచర్ మృతి చెందిన సంఘటన సత్తుపల్లి లో సోమవారం సాయంత్రం

దిశ, సత్తుపల్లి : షుగర్, కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న అంగన్వాడీ టీచర్ మృతి చెందిన సంఘటన సత్తుపల్లి లో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం. సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని గాంధీనగర్ రోడ్డు 7 వీధీ 16వ వార్డుకు చెందిన బలవంతపు అగర్త (55) గత కొంత కాలంగా షుగర్ ,కిడ్నీ పక్షవాతం సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ తరుణంలోనే సోమవారం ఆమె మృతి చెందారు. ఆమె ఐసిడిఎస్ సత్తుపల్లి సెక్టార్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ కొత్తూరు అంగన్వాడి కేంద్రంలో అంగన్వాడీ టీచర్ గా పనిచేస్తున్నారు. ఇక అంగన్వాడి టీచర్ బలవంతపు అగర్త మృతి నేపథ్యంలో సత్తుపల్లి సిడిపిఓ,మైహర్నషా బేగం సూపరేజర్ సుజాత, అంగన్వాడి టీచర్లు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. మృతురాలికి భర్త వెంకటేశ్వరరావు, ఒక కుమారుడు ఉన్నారు.






