- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నూతన బస్టాండ్ ఏర్పాటు కోసం కృషి చేస్తా
by velandi.Saikiran |
అధికారుల నిర్లక్ష్యం వల్లే బస్టాండ్ కు ఈ దుస్థితి ఏర్పడిందని కొత్తగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

X
దిశ, కొత్తగూడెం: అధికారుల నిర్లక్ష్యం వల్లే బస్టాండ్ కు ఈ దుస్థితి ఏర్పడిందని కొత్తగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి కొత్తగూడెం బస్టాండ్ లో ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ... కొత్తగూడెంలో నూతన బస్టాండ్ ఏర్పాటు కోసం కృషి చేస్తానని అన్నారు.
ఇందుకోసం ప్రభుత్వంతో మాట్లాడి ప్రత్యేక నిధులు కేటాయించేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. బస్టాండ్ కు వచ్చే ప్రయాణాలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు మంచి వాతావరణం కల్పించాలని సూచించారు. ఇకనైనా అధికారులు తమ తీరు మార్చుకొని బస్టాండ్ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఫైర్ అయ్యారు. ఆయన వెంట సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, ఆర్టీసీ అధికారులు సిబ్బంది స్థానిక నాయకులు ఉన్నారు.
Next Story






