కొత్తగూడెం కార్పొరేషన్.. సీపీఐ మేయర్ అభ్యర్థుల్లో త్రిముఖ పోటీ

by velandi.Saikiran |

మున్సిపల్ కార్పొరేషన్ తొలి మేయర్ గా ఎన్నికవలనే అంశంపై సీపీఐ లో కూడా త్రిముఖ పోటీ నెలకొంది. మూడ్ గణేష్, నూనావత్ శ్యామల, బానోత్ కళావతి ల మధ్య పోటీ నెలకొంది.

కొత్తగూడెం కార్పొరేషన్.. సీపీఐ మేయర్ అభ్యర్థుల్లో త్రిముఖ పోటీ
X

కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారానికి అంత రెడీ ..!

* ముస్తాబైన కౌన్సిల్ హాల్

* సీపీఐ మేయర్ అభ్యర్థుల్లో త్రిముఖ పోటీ

* డిప్యూటీ మేయర్ పై కాంగ్రెస్ పీటముడి

* కార్పొరేటర్ల ను చే ప్రమాణ స్వీకారం చేయించనున్న జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్

దిశ, కొత్తగూడెం ప్రతినిధి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విడుదల చేసిన షెడ్యూల్ మేరకు సోమవారం కొత్తగూడెం కార్పొరేషన్ కు నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని, కౌన్సిల్ హాల్ ను ఇప్పటికే అలంకరించారు. నూతనంగా ఎన్నిక కాబడిన కార్పొరేటర్ల తో జిల్లా జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. తొలుత కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం అనంతరం నూతన మేయర్, డిప్యూటీ మేయర్ లను ఎన్నుకునే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు కమిషనర్ సుజాత తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జరుగుతున్న ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ పర్యవేక్షించారు.

* మేయర్ పదవిపై త్రిముఖ పోటీ

మున్సిపల్ కార్పొరేషన్ తొలి మేయర్ గా ఎన్నికవలనే అంశంపై సీపీఐ లో కూడా త్రిముఖ పోటీ నెలకొంది. మూడ్ గణేష్, నూనావత్ శ్యామల, బానోత్ కళావతి ల మధ్య పోటీ నెలకొంది. ఇప్పటికే జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించి పార్టీ నాయకులు చర్చించినప్పటికీ కొలిక్కి రాలేదని పార్టీ నాయకులు చెబుతున్నారు. సోమవారం ఉదయం నాటికి కొలిక్కి వస్తుందని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇక కాంగ్రెస్ లో డిప్యూటీ మేయర్ కోసం పోటా పోటీ నెలకొంది. ఎస్ సి కోటా లో 25వ డివిజన్ నుండి గెలిచిన కనుకుంట్ల శ్రీనివాస్ , 15వ డివిజన్ నుండి గెలిచిన అకునూరీ సుప్రియ, బీసీ కోట నుండి 5వ డివిజన్ నుండి గెలిచిన కొత్వాల విమలదేవి, 5వ డివిజన్ నుండి గెలిచిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, పాల్వంచ పట్టణ అధ్యక్షుడు నూకల రంగారావు సతీమణి నూకల సరిత, ఓసీ కోటా లో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సన్నిహితుడు లింగం పిచ్చిరెడ్డి సతీమణి లింగం పుష్పవతి లు పదవిని ఆశిస్తున్నారు. ఇప్పటివరకు డిప్యూటీ మేయర్ పై క్లారిటీ రాకపోవడంతో నాయకులు తర్జన భర్జన పడుతున్నారు. సోమవారం ఉదయం నాటికి కొలిక్కి రావొచ్చని పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. పార్టీ అగ్ర నాయకులను ఈ అంశంపై వివరణ కోరగా సీల్డ్ కవర్ లో ఎవరు పేరు వ‌స్తే వాళ్ళే పేరు ఫైనల్ అవుతుందని జవాబిచ్చారు.

Next Story