శాంతి కోసం ‘ఖమ్మం’.. మానవత్వాన్ని చాటుతూ పాలస్తీనా సంఘీభావ ర్యాలీ

by Chintha Aamani |

ఖమ్మం మానవత్వాన్ని చాటుకుంది.

శాంతి కోసం ‘ఖమ్మం’.. మానవత్వాన్ని చాటుతూ పాలస్తీనా సంఘీభావ ర్యాలీ
X

దిశ,ఖమ్మం సిటీ : ఖమ్మం మానవత్వాన్ని చాటుకుంది. ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ పాలస్తీనాకు మద్దతుగా గురువారం చేపట్టిన ర్యాలీ కనీవినీ ఎరుగని రీతిలో సాగింది. ఫ్లకార్డులు, యుద్ధ మారణకాండ,పసికందులు, మహిళల మరణాలు, కండ్లకు కట్టేలా వేషధారణలతో సాగిన ప్రదర్శన ఆలోచింపజేసింది. విశ్వమానవ శ్రేయస్సు కోసం ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్య వాదులు, మేధావులు, విద్యార్థులు...కదం తొక్కారు. ప్రపంచ శాంతికి జై కొట్టారు.

పాలస్తీనా సంఘీభావ కమిటీ పిలుపు మేరకు ఖమ్మం పట్టణంలో ఇజ్రాయెల్ గాజాలో చేస్తున్న జాతి హనన చర్యలకు వ్యతిరేకంగా వేలాదిమంది తో ప్రదర్శన నిరసన ర్యాలీ సాగింది. ఈ ర్యాలీలో ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల విద్యార్థులు , సిపిఎం , సిపిఐ, మాస్ లైన్, న్యూ డెమోక్రసీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ప్రదర్శనలో అగ్రభాగాన నిలిచారు. వివిధ మైనారిటీ సంస్థలకు చెందిన మహిళలు, యువకులు జాతీయ జెండాలు, పాలస్తీనా జెండాలతో సంఘీభావం ప్రదర్శిస్తూ 'సేవ్ గాజా' అనే నినాదంతో హెూరెత్తించారు. వివిధ ప్రజా సంఘాలు, విద్యార్థి, యువజన సంఘాలు పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ యుద్ధోన్మాదాన్ని ఖండిస్తూ ర్యాలీలో నడిచారు. మార్చ్ ఫర్ హ్యుమానిటీ పేరుతో గాజాలో పాలస్తీనా జాతి హననానికి ఇజ్రాయెల్ చేస్తున్న దుశ్చర్యలను ఖండించారు.

తొలుత నగరంలోని పెవిలియన్ గ్రౌండ్ నుంచి జడ్పీ సెంటర్‌ వరకు ఇజ్రాయిల్ పై నిరసన వ్యక్తం చేస్తూ పాలసీనకు మద్దతుగా సంఘీభావం ర్యాలీ చేపట్టారు. ముఖ్యంగా ర్యాలీలో చిన్నారుల వేషధారణ గాజాలో చిన్నారుల మృతి కాండను తెలిపే విధంగా చిన్నారుల వేషధారణ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఖమ్మం జడ్పీ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సభలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ పాలస్తీనా, ఇజ్రాయెల్ ఘర్షణలకు కారణాలు ఏవైనా కావచ్చు. రెండు పక్షాలకూ తమవైన రాజకీయ కారణాలు ఏవైనా ఉండొచ్చు. చిన్నారులేం నేరం చేసారన్నది ప్రశ్న, మహిళలేం పాపం చేశారన్నది సందేహం, మనం అడుగుతుంది, అడగాల్సింది మానవత్వం గురించి,గాజా స్ట్రిప్ పై ఇజ్రాయెల్ దాడులు నిలువెత్తు మానవ హక్కుల ఉల్లంఘన, అక్షరాలా అన్యాయం. హింసకు పరాకాష్ఠ. ఈ దౌర్జన్యం వల్ల గాజాలో నీరు, విద్యుత్, ఆహారం, ఔషధాల కొరత తీవ్రమైందని, ఆసుపత్రులు, పాఠశాలలు ధ్వంసమయ్యాయని, పౌరులెందరో చనిపోయారని, పసి పిల్లలు మరణిస్తున్నారని, ఇప్పటి వరకు 18,500 పసి హత్యలు జరిగాయని, అనధికారిక లెక్క మొత్తం 40 వేల మంది చనిపోయారని, అధికారిక లెక్క నిజానికి గాజా స్ట్రిప్, పాలస్తీనాలోని ఒక చిన్న భూభాగం, దశాబ్దాలుగా ఇజ్రాయెల్ , పాలస్తీనా ఘర్షణలకు ఈ ప్రాంతం ప్రధాన కేంద్రం. 1948లో ఇజ్రాయెల్ స్థాపన తర్వాత, లక్షలాది పాలస్తీయన్లు గాజా, వెస్ట్ బ్యాంక్లకు వలస వెళ్లారని తెలిపారు. తమ తమ భూములను కోల్పోయారని ,ఆ తర్వాత 1967 యుద్ధంలో గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్ లాంటి ప్రాంతాలను ఇజ్రాయెల్ ఆక్రమించిందని అన్నారు.

అప్పటి నుంచి అక్కడి ప్రజలు నిరంతరం అక్రమ ఆక్రమణలు, ఆంక్షలు, దాడులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. 2005లో ఇజ్రాయెల్ గాజాకు పేరుకు స్వేచ్ఛ ఇచ్చినట్టే ఇచ్చి భూమి, సముద్రం, గగనతలంపై లెక్కలేనన్ని ఆంక్షలు విధించిందని తెలిపారు .అదే "విశ్వవ్యాప్త బ్లాకేడ్". పైగా గాజాలో ప్రజలే ఎంచుకున్న పాలకపక్షం హమాస్కు ఇజ్రాయెల్ తీవ్రవాద సంస్థ అని ముద్ర వేసిందని, ఈ ముద్రను హామాస్కు ఇతర అనేక అగ్ర రాజ్యాలు కూడా వేసాయని, ఈ నేపథ్యంలో హమాస్ 2023లో ఇజ్రాయెల్ పై దాడి చేసిందని, దానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ గాజాపై బాంబులు కురిపించిందని అన్నారు. పాలస్తీనా లో చిన్నారుల భవితవ్యాన్ని చిదిమేస్తున్న ఇజ్రాయిల్ దురహంకార దాడుల్ని ఖండించాలని అన్నారు. ఒక ప్రణాళిక ప్రకారం గా అమెరికా ఇజ్రాయిల్ కలసి గాజాను ఆక్రమించడానికి ప్రయత్నంలో భాగంగా ఈ యుద్ధం జరుగుతుందని యుద్ధం ప్రారంభమై రెండు సంవత్సరాలు కావస్తుందని, ఇప్పటికీ చిన్నారులు లక్ష్యంగా ప్రతి రోజు ఆకలి ఆశ చూపించి వాళ్లను కాల్చి చంపుతున్నారని ఇప్పటికి 80 వేల మందిని పొట్టలో పెట్టుకున్నారని, కేవలం అక్కడ ఉన్న ముడి సరుకుని దృష్టిలో పెట్టుకొని అమెరికా ఆడిస్తున్న నాటకం యుద్ధం చేయలేక ప్రపంచం అంతా కూడా ఖండిస్తున్నప్పుడు ఆకలి తీరుస్తామని, ఇతర దేశాలు ఇచ్చిన సామాగ్రి పంచుతామని ,వాళ్లని రప్పించి తుపాకులతో కాలుస్తున్నారని ,ఇది సిగ్గుచేష్టమైన విషయమని ప్రపంచ దేశాలని ముక్త ఖండంతో ఖండించాలని అన్నారు.

అమెరికా అండతో ఇజ్రాయేల్‌ దాడులు చేస్తుందని, కేంద్ర ప్రభుత్వం పాలస్తీన మీద జరుగుతున్న దాడులను ఖండించకపోవడం దారుణమని, ఇప్పటికైనా ఐక్యరాజ్య సమితి తీర్మానానికి కట్టుబడి ఇజ్రాయేల్‌ దాడులు ఆపాలని, పాలస్తీనాకు అన్నపాణియాలు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. నెతన్యాహుని యునైటెడ్ నేషన్స్ యుద్ధ నేరస్తునిగా ప్రకటించిందనీ, ఇజ్రాయెల్ సైన్యాలు గాజాలో మానవతా సాయాన్ని కూడా అందకుండా చేస్తుందనీ, ఆహార పదార్థాలు, మందులు అందకుండా చేసి ఆకలి చావులకు గురి చేస్తుందని వివరించారు. ఆసుపత్రులు, స్కూళ్ళు నివాస స్థలం పై బాంబులు కురిపించి వందలాది మంది డాక్టర్లను, వేలాది మంది పసి పిల్లలను చంపిన ఇజ్రాయెల్ చర్యలను ఖండించాలని అన్నారు. తక్షణమే యుద్ధాన్ని ఆపివేయాలని, గాజాలో ఆహార పదార్థాలు, మందులు, మానవతా సాయాన్ని పునరుద్దరించాలని డిమాండ్ చేశారు.

ఈ ర్యాలీలో ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల యాజమాన్యాలు మువ్వా శ్రీనివాసరావు, కాంతారావు, వీరారెడ్డి, శేషగిరి, మతీన్, రవి మారుతి, రమణారావు, ప్రసాద్, వెంకటేశ్వర రావు , ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ కంభంపాటి నారాయణ రావు, డాక్టర్లు జి.వి.జగదీష్, రవీందర్, నాగమణి, గోపీనాథ్, రహానా, కృష్ణరావు, భారవి , న్యాయవాదులు జక్కంపూడి నాగేశ్వర రావు, తిరుమల రావు, శేషగిరి, విప్లవ కుమార్ , సిపిఐ కేంద్ర నాయకులు అజీజ్ పాషా , జిల్లా కార్యదర్శి దండి సురేష్ , సిపిఎం డివిజన్ కార్యదర్శి వై. విక్రమ్, కాంగ్రెస్ పార్టీ మొక్కా శేఖర్ గౌడ్, బి.ఆర్.ఎస్ పార్టీ పట్టణ కార్యదర్శి పి.నాగరాజు , గ్రంథాలయ మాజీ చైర్మన్ ఖమర్ , మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు , జిల్లా కార్యదర్శి గోకినపల్లి వెంకటేశ్వర్లు , న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఆవునూరి మధు , జిల్లా కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్ , జమాతే ఇస్లాం జిల్లా అధ్యక్షులు జైనూల్ పాష , మహ్మద్ ఇలియాస్ , కాంగ్రెస్ మైనారిటీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ హుస్సేన్ , విద్యార్థి సంఘ నాయకులు రామకృష్ణ, వెంకటేష్, ప్రవీణ్, మస్తాన్లు యువజన సంఘాల నాయకులు బషీరుద్దీన్ , శివరామ కృష్ణ, పుల్లయ్య, రాకేష్, మహిళా సంఘాల నాయకులు బండి పద్మ, పోటు కళావతి, ఝాన్సీ, లక్ష్మి పౌర హక్కుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, జర్నలిస్టు సంఘాల నాయకులు కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి, ఖదీర్, సాగర్, యాకేష్, రవి కిరణ్, గరిడేపల్లి వెంకటేశ్వర్లు,రామ చంద్ర మూర్తి,పారుపల్లి కృష్ణారావు,నాగల్ మిరా, డి. వెంకటేశ్వర్లు, బి. నాగేశ్వరావు, షకిల్, డిజైనర్ అంజయ్య , ఏనుగు వెంకటేశ్వర్లు, ఆది నారాయణ, జలాలుద్దీన్, చిర్రా రవి సంఘీభావ కమిటీ సభ్యులు కాకి భాస్కర్, విజయ్, బండారు రమేష్, ప్రసేన్, సీతారాం , నవతెలంగాణ రీజనల్ మేనేజర్ యస్. డి. జావీద్, ఎడీవీటీ ఇంచార్జి లు యల్. వీరారెడ్డి, సి. హెచ్. నారాయణ, గుమ్మడి నర్సయ్య, సర్క్యులేషన్ ఇంచార్జి వి. వెంకటేశ్వర్లు, బుక్ హజ్ ఇంచార్జి ఎ. వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Next Story