- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఖమ్మం కార్పొరేషన్ పాలకవర్గం ఆసక్తి
ఖమ్మం కార్పొరేషన్ పాలకవర్గం పదవీకాలం ఏప్రిల్30తో ముగియనున్న నేపథ్యంలో ముందస్తు ఎన్నికలకు పాలకవర్గం మొగ్గు చూపుతున్నది.

Khammam Corporation
ముందస్తుకే మొగ్గు
ఖమ్మం కార్పొరేషన్ పాలకవర్గం ఆసక్తి
ఎన్నికలపై స్పష్టత రాలేదంటున్న కేఎంసీ కమిషనర్
డివిజన్ల పునర్విభజనకు రాని అనుమతి
ఓటర్ల జాబితా ప్రదర్శన లేదు
ఖమ్మం కార్పొరేషన్ పాలకవర్గం పదవీకాలం ఏప్రిల్30తో ముగియనున్న నేపథ్యంలో ముందస్తు ఎన్నికలకు పాలకవర్గం మొగ్గు చూపుతున్నది. మేయర్ పునుకొల్లు నీరజ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు సమావేశమై ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని, మంత్రి తుమ్మల దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. గడువు ముగిసిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించి, ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఖమ్మం కార్పొరేషన్‌కు ఓటర్ జాబితాకు సంబంధించిన ఆదేశాలు ఇంకా రాలేదు. ఓటర్ల సంఖ్య పెరిగిన నేపథ్యంలో డివిజన్ల పునర్విభజన చేసి ప్రస్తుతం ఉన్న డివిజన్లను పెంచేందుకు అనుమతి కోరుతూ సీడీఎంఏకు లేఖ రాసినా అనుమతి రాలేదు. ఈ నేపథ్యంలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయా అనే విషయంలో సంశయం నెలకొంది. అధికార పక్షానికి చెందిన కార్పొరేటర్లు మాత్రం ముందస్తు ఎన్నికల కోసం పట్టుబడుతున్నట్లు తెలుస్తున్నది. త్వరలో డివిజన్ల పునర్విభజన జరిగి నగరంలో 65డివిజన్లు వస్తాయని ప్రచారం చేస్తున్నారు.
- దిశ, ఖమ్మం కార్పొరేషన్
దిశ, ఖమ్మం కార్పొరేషన్: ఖమ్మం కార్పొరేషన్ పాలకవర్గం పదవీకాలం ఏప్రిల్30తో ముగుస్తుంది. వాస్తవంగా మే నెలలో కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించాలి. అయితే రాష్ట్రంలో హైదరాబాద్ మహా నగరపాలక సంస్థలో విలీనమైన కొన్ని కార్పొరేషన్లు మినహా మిగతా చోట్ల ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఖమ్మం కార్పొరేషన్లో ముందస్తు ఎన్నికలు ఫిబ్రవరిలోనే వస్తాయని ఊహాగానాలు వస్తున్నాయి. అయితే పాలకవర్గం గడువు ముగిసిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికల నిర్వహించాలని ప్రభుత్వం నిశ్చయించి ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా ఖమ్మం కార్పొరేషన్‌కు ఓటర్ జాబితాకు సంబంధించిన ఆదేశాలు రాలేదు. అంతేగాక ఖమ్మం కార్పొరేషన్‌లో డివిజన్ల పునర్ విభజనకు సంబంధించి ఇంకా ఆదేశాలు రాలేదు. ఈ నేపథ్యంలో ఖమ్మం కార్పొరేషన్ కు ముందస్తు ఎన్నికలు జరుగుతాయా అనే విషయంలో సంశయాలు నెలకొన్నాయి.
ముందస్తు ఎన్నికలకు పాలకవర్గం మొగ్గు
ఖమ్మం కార్పొరేషన్లో ముందస్తు ఎన్నికలకు పాలకవర్గం మొగ్గు చూపుతున్నది. అధికార పక్షానికి చెందిన కార్పొరేటర్లు తాము ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధమేనని అంటున్నారు. కాగా ఖమ్మం మేయర్ పునుకొల్లు నీరజ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు సమావేశమై ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. అయితే మార్చి నెలలో ప్రవేశపెట్టే బడ్జెట్ కోసం సమావేశం నిర్వహించామని చెబుతున్నప్పటికీ మేయర్ నీరజ ముందస్తు ఎన్నికలపై అధికారపక్ష కార్పొరేటర్ల అభిప్రాయాలు సేకరించినట్లు సమాచారం.
ఓటర్ల జాబితా ప్రదర్శనకు రాని ఆదేశాలు
ఫిబ్రవరిలో నిర్వహించే పురపాలక, నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా ప్రదర్శించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించారు. అయితే ఖమ్మం కార్పొరేషన్‌కు ఈ ఆదేశాలు రాలేదు. ఈ విషయమై ఎటువంటి ఆదేశాలు రాలేదని ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య దిశ విలేకరికి తెలిపారు
డివిజన్ల పునర్విభజనకు రాని అనుమతి
ఖమ్మం కార్పొరేషన్‌లో ఓటర్ల సంఖ్య పెరిగిన నేపథ్యంలో డివిజన్ల పునర్విభజన చేసి ప్రస్తుతం ఉన్న డివిజన్లను పెంచేందుకు అనుమతి కోరుతూ కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య రాష్ట్ర కమిషనర్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అథారిటీకి లేఖ రాశారు. అయితే ఇప్పటివరకు అనుమతి రాలేదు. దీంతో ఓటర్ల జాబితా ప్రదర్శన, డివిజన్ల పునర్విభజనపై ఇంకా స్పష్టత లేదు. అధికార పక్షానికి చెందిన కార్పొరేటర్లు మాత్రం ముందస్తు ఎన్నికల కోసం పట్టుబడుతున్నారు. త్వరలో డివిజన్ల పునర్విభజన జరిగి నగరంలో 65 డివిజన్లు వస్తాయని ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయం పై ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల విషయం ఆధారపడి ఉంది.






