శ్రీనివాస కళ్యాణంలో పాల్గొన్న చిన్న జీయర్ స్వామి, మంత్రి తుమ్మల

by Bhanu |

సత్తుపల్లి పట్టణ పరిధిలోని జీవీ మాల్ వెనుక నూతనంగా నిర్మాణం చేపట్టిన గృహ సముదాయ సమగ్ర యూనిట్ సభ్యుల ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం జరిగిన శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు

శ్రీనివాస కళ్యాణంలో పాల్గొన్న చిన్న జీయర్ స్వామి, మంత్రి తుమ్మల
X

దిశ, సత్తుపల్లి: సత్తుపల్లి పట్టణ పరిధిలోని జీవీ మాల్ వెనుక నూతనంగా నిర్మాణం చేపట్టిన గృహ సముదాయ సమగ్ర యూనిట్ సభ్యుల ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం జరిగిన శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సమగ్ర యూనిట్ నిర్వాహకులు, శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి, మంత్రి తుమ్మలని శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల తో పాటు సత్తుపల్లి నియోజకవర్గ సీనియర్ నాయకులు చల్లగుళ్ళ నరసింహారావు, విద్యాసంస్థల అధినేత చలసాని సాంబశివరావు, కొత్తూరు ప్రభాకర్ రావుతో పాటు సమగ్ర యూనిట్ కార్యవర్గ సభ్యులు నాయకులు, తుమ్మల అభిమానులు పాల్గొన్నారు.

Next Story