- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్లాంటేషన్ పోడుకు వెళ్తున్న జేసీబీల అడ్డగింత
ప్లాంటేషన్ పోడులో ఫారెస్టు అధికారులు పనులు ప్రారంభించారు.

దిశ, కారేపల్లి: ప్లాంటేషన్ పోడులో ఫారెస్టు అధికారులు పనులు ప్రారంభించారు. ప్లాంటేషన్ పోడుపై పోడుదారులు, ఫారెస్టు మధ్య వివాదం సాగుతూ ఉద్రిక్తలకు దారితీసి కేసు పెట్టుకునే వరకు వచ్చింది. ఈక్రమంలో ఫారెస్టు అధికారులు వివాదస్పద ప్లాంటేషన్ పోడులో మంగళవారం నుండి పనులు ప్రారంభించారు. ఖమ్మం రూరల్ ఏసీపీ పరిధిలోని పోలీస్ సిబ్బంది సీఐ తిరుపతిరెడ్డి, కారేపల్లి, కామేపల్లి ఎస్సైల ఆధ్వర్యంలో బందోబస్తు మధ్య ఫారెస్టు అధికారులు బుధవారం కూడా పనులు చేయటానికి జేసీబీలతో ప్లాంటేషన్ పోడుకు వెళ్తుండగా పోడుదారులు అడ్డుకున్నారు. జేసీబీలను అడ్డుకోని తమకు ప్రత్యామ్నాయం చూపిన తర్వాతే ప్లాంటేషన్‌లో పనులు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు, ఫారెస్ట్ అధికారులు, పోడు దారులతో మాట్లాడారు.
పోడుపై హక్కులు తెచ్చుకుంటే మీ జోలికి రామన్నారు. ప్లాంటేషన్ వేయాలనే లక్ష్యం కోసం ప్రత్యామ్నాయం పోడు చూపుతామని మభ్యపుచ్చి మా జీవితాలు ఆగం చేయాలని చూస్తున్నారని పోటిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంతో మాట్లాడి పట్టాలు తేచ్చుకోవాలని తమ విధులకు ఆటంకం కల్పించవద్దని అధికారులు సూచించారు. ప్లాంటేషన్ వేయటానికి ప్రత్యామ్నాయ పోడు చూపుతామని ఫారెస్టు అధికారులే హామీ ఇచ్చారని, ఇప్పుడు ప్రభుత్వం ద్వారా హక్కు తెచ్చుకోవాలని చెప్పడం ఎంతవరకు సమంజసమన్నారు. కేసులు పెట్టి నిర్భందాలు పెట్టిన మా పోడు దక్కే వరకు పోరాటం ఆగేది లేదని తెగేసి చెప్పారు.
ఖమ్మంలో చర్చిద్దాం రండి : ఎఫ్‌డీవో వెంకన్ననాయక్
ప్లాంటేషన్ పనులకు అడ్డుచెప్పవద్దని ప్లాంటేషన్ పోడుదారుల సమస్యలపై ఖమ్మం ఫారెస్టు కార్యాలయంలో చర్చిద్దామని ఎఫ్‌డీవో వెంకన్న నాయక్ అన్నారు. పోడు దారులతో మాట్లాడిన ఆయన జేసీబీలను వదిలివేయాలని రెండు రోజుల తర్వాత సమస్యలపై చర్చిద్దామని చెప్పటంతో పోడుదారులు ఆందోళన విరమించారు.






