- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాములోరి లగ్గానికి వేళాయె..
భద్రాచలం సీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 12 వరకు శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు

దిశ ,భద్రాచలం : భద్రాచలం సీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 12 వరకు శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 6 శ్రీరామ నవమి నాడు స్వామి వారి కళ్యాణం, 7న పట్టాభిషేకం భద్రాద్రి లోని మిథలా స్టేడియంలో అంగరంగ వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
శుక్రవారం పాల్గుణ పూర్ణిమ నాడు పెండ్లి పనులు ప్రారంభం అయ్యాయి. పసుపు కొట్టి తలంబ్రాలు కలిపే కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు, తాము ఎంతో భక్తితో గోటితో వలిచిన బియ్యాన్ని శిరస్సు పై ధరించి, గిరిప్రదక్షణ గావించి తలంబ్రాలలో కలిపారు. సుదూర ప్రాంతాలలోని భక్తుల సౌకర్యం కొరకు ఈ నెల 12 నుండి స్వామి వారి కళ్యాణం వీక్షించేందుకు వివిధ సెక్టార్ల టికెట్స్ ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు.
టికెట్స్https://bhadradritemple. telanganna.gov. in వెబ్ సైట్ ద్వారా పొందవచ్చని రామాలయం అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 20 నుండి నేరుగా కల్యాణ టికెట్స్ విక్రయుంచునున్నారు. శ్రీరామ నవమి నాడు భద్రాచలం రాలేని భక్తులు సైతం తమ పేరుతో కళ్యాణం చేపించుకునేందుకు పరోక్ష సేవలను ప్రవేశపెట్టారు. వీరికోసం రు 5 వేలు, రూ. 1116 విలువగల టికెట్స్ ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు. శ్రీరామ నవమి కళ్యాణ పనులకోసం టెండర్లు ఖరారు చేయగా.. పనులు చురుగ్గా సాగుతున్నాయి. దేశ వ్యాప్తంగా గల భక్తులు భద్రాద్రి ఆలయ సమాచారం తెలుసుకునేందుకు వీలుగా ఒక ప్రత్యేక యాప్ రూపోందించారు. ఆ యాప్ ను వసంత పంచమి శుక్రవారం సాయంత్రం ఈ ఓ రమాదేవి ప్రారంభించారు.
ఘనంగా వసంతోత్సవం, డోలోత్సవం
హోలీ పూర్ణిమ సందర్బంగా భద్రాచలం రామాలయంలో స్వామి వారికి వసంతోత్సవం, డోలోత్సవం ఘనంగా నిర్వహించారు. ముందుగా స్వామి వారికి సహస్ర దారతో ప్రత్యేక స్నపనం నిర్వహించారు. అనంతరం స్వామివారిని అలంకరించి ఉయ్యాలలో వేంచేపు చేసి డోలోత్సవం కన్నుల పండువగా జరిపారు. స్వామి వారికి నక్షత్ర, కుంభ హరతులను సమర్పించారు. వసంతోత్సవంలో భాగంగా ప్రధాన ఆలయంలోని ధ్రువ మూర్తులకు, ఆంజనేయ స్వామి వారికి, లక్ష్మి తాయారు అమ్మవారికి వసంతాన్ని శాస్త్రోక్తంగా చ, అనంతరం భక్తులపై వసంతోత్సవం చిహ్నంగా పసుపు నీళ్లు చల్లారు. సాయంత్రం స్వామి వారికి మేళతాళాలు, మంగళ వాయుధ్యాలు, వేదమంత్రాలు, భక్తుల జయ జయ ద్వానాల నడుమ తిరువీధి సేవ నిర్వహించారు.






