- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుట్టు చప్పుడు కాకుండా సరిహద్దులు దాటుతున్న కలప
దిశ, లక్ష్మీదేవిపల్లి : గుట్టు చప్పుడు కాకుండా.. ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా జిల్లా నుంచి

దిశ, లక్ష్మీదేవిపల్లి : గుట్టు చప్పుడు కాకుండా.. ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా జిల్లా నుంచి లక్షలు విలువైన కలప అక్రమంగా తరలిపోతుంది. అధికారుల కళ్లు గప్పి అక్రమార్కులు జిల్లాలోని అటవీ ప్రాంతాలలో నుంచి ఎంతో విలువైన కలపను సరిహద్దులు దాటిస్తున్నారు. అటవీ సంపదను కాపాడేందుకు, ఆక్రమణలకు గురి కాకుండా సంరక్షించేందుకు విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పూర్తిస్థాయిలో దృష్టి సాధించకపోవడంతో ఇలాంటి అక్రమ రవాణాలు ఇటీవల కాలంలో మరి ఎక్కువగా జరుగుతున్నాయంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు. పక్కా సమాచారం మేరకు అటవీ అధికారులు ఈ అక్రమ కలప తరలింపునకు అడ్డుకట్ట వేశారు. అయితే ఆదివారం ఉదయం ఈ సంఘటన జరగగా వివరాలను గోప్యంగా ఉంచి నట్లు సమాచారం.
రెండున్నర లక్షల విలువైన కలప పట్టివేత..
అక్రమంగా తరలిపోతున్న విలువైన కలపను అటవీ అధికారులు పట్టుకున్నారు. ఇల్లందు క్రాస్ రోడ్ వద్ద ఆదివారం ఉదయం ఏడు గంటలకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రాంప్రసాద్, బేస్ క్యాంప్ ఆఫీసర్ గణేష్ నాగరాజు వాహనాలు తనిఖీ చేస్తుండగా అక్రమ కలప ఉన్నట్లు గుర్తించారు. ఈ కలప విలువ సుమారు రెండున్నరలక్షల వరకు ఉంటుందని అధికారులు చెప్పారు. కలప తరలిస్తున్న వాహనం ఉత్తరప్రదేశ్ రిజిస్ట్రేషన్ తో ఉందని, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. అయితే ఆదివారం కలప పట్టుకుంటే ఆ విషయం బయటికి రాకుండా అధికారులు గోప్యంగా ఉంచడం వెనుక ఆంతర్యం ఏమిటని పలువురు చర్చించుకుంటున్నారు.






